చిన్న‌కాకాని ఘ‌ట‌న‌ లో రెండో కోణం.. అప్పుడే చ‌ర్చ‌...!

Update: 2020-01-07 09:40 GMT
రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి సంచ‌నాలు లేవు.. అను కుంటున్న ఓవ‌ర్గం ప్ర‌జ‌ల‌కు, మీడియా కు కూడా తాజాగా మంగ‌ళ‌గిరి మండ‌లం చిన్న‌కాకానిలో జ‌రిగిన ఘ టన పెద్ద‌గా ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌లేదు. ర‌హ‌దారుల దిగ్బంధానికి అమ‌రావ‌తి జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా రైతులు, విద్యార్థులు, కొంద‌రు యువ‌త కూడా పాల్గొన్నారు. అయితే, అనూహ్యంగా చిన్న‌కాకాని ద గ్గ‌ర ఉద్రిక్త‌త చెల‌రేగింది. నిజానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఆందోళ‌న‌ల‌న్నీ శాంతి యుతంగానే జరిగా యి. అయితే, ఇప్పుడు మాత్రం ఒక్క‌సారిగా ఉద్రిక్త‌త ఏర్ప‌డి, రాళ్లు.. క‌ర్ర‌లు ఉద్య‌మాల్లోకి చేరిపోయాయి.

చిన్న‌కాకాని హైవే పై వెళ్తున్న ప్ర‌భుత్వ విప్‌, మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి పై ఆందోళ‌న కారులు రాళ్లు క‌ర్ర‌ల‌తో విరుచుకుప‌డ్డారు. అయితే, ఈ క్ర‌మంలో ఆయ‌న కారులోనే ఉండి పోవ‌డం తో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆందోళ‌న కారుల దాడి కారు భారీగా ధ్వంస‌మైంది. కారు అద్దాలు పూర్తిగా ప‌గిలి పోయాయి. అదేస మయంలో పోలీసులకు ఆందోళ‌న కారుల‌కు మ‌ధ్య వివాదం, వాగ్వాదం, తోపులాట‌లు జ‌రిగాయి. ఇంత‌వ ర‌కు బాగానే ఉంది. అయితే, ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే విష‌యాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించేలా వ్యూహాత్మ‌క క‌థ‌నాలు, ప్ర‌చారాలు తెర‌మీదికి వ‌చ్చాయి.

శాంతియుతంగా సాగాల్సిన ఆందోళ‌న‌ల‌ను రెచ్చ‌గొట్టిన వారిపై పోలీసులు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డంతో పాటు.. ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటుంద‌ని భావించిన ఓవ‌ర్గం.. దీనిని అసాంఘిక శ‌క్తుల దాడిగా అభివ‌ర్ణించే ప్ర‌య‌త్నం చేసింది. వాస్త‌వానికి రైతులైనా, విద్యార్థులైనా ఆందోళ‌న‌కారులైనా.. దాదాపు 20 రోజులు గా ఆవేద‌న తో ఉన్నారు. వీరికి స‌ర్ది చెప్ప‌డ‌మో.. శాంతి యుతంగా ఆందోళ‌న‌లు సాగేలా చేయ‌డమో చేయాల్సిన మాజీ సీఎం చంద్ర‌బాబు కానీ, ఇత‌ర నాయ‌కులు కానీ ఎప్ప‌టిక‌ప్పుడు రెచ్చ‌గొట్ట‌డం చేస్తున్నారు.

``జైళ్లు కూడా చాల‌వు.. ప్రాణాల‌కు తెగించైనా సాధించుకుంటాం`` వంటి వ్యాఖ్య‌లు స‌హ‌జంగానే యువ‌త‌లో మ‌రింత ఆవేశాన్ని పెంచుతాయి. ఈ క్ష‌ణికావేశంలోనే దాడులు, మార‌ణ‌కాండ‌లు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలానే జ‌రిగింది. మ‌రి దీనిని క‌ప్పిపుచ్చుకునేందుకు ఓవ‌ర్గం మీడియా హుఠా హుఠిన ``అశాంఘిక శ‌క్తులు.. అమ‌రావ‌తి ని వ్య‌తిరేకిస్తున్న‌వారు(వైసీపీ మ‌ద్ద‌తుదారులు).. నిర‌స‌న‌ల్లోకి చొర‌బ‌డి ఇలా చేసి, రైతుల ఆందోళ‌న‌ల‌ను విచ్ఛిన్నంచేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు``-అంటూ పెద్ద ఎత్తున క‌థ‌నాల‌ను వండి వార్చేస్తున్నాయి. దీనికంటే కూడా శాంతి యుత ఆందోళ‌న‌ల‌కు, అహింసా మార్గాల్లోకి యువ‌త‌ను, రైతుల‌ను మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తే మంచిద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వ‌ర్గాలు ప‌ట్టించుకుంటాయా? చూడాలి.




Tags:    

Similar News