ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి తీవ్ర షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపిన వైసీపీ ఆరుగురును మాత్రమే గెలిపించుకోగలిగింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డితోపాటు మరో ఇద్దరు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అభ్యర్థికి ఓట్లేయడంతో ఆ పార్టీకి చెందిన పంచుమర్తి అనురాధ గెలుపొందారు.
ఈ నేపథ్యంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అందుకే ఆ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు.
ఈ క్రమంలో తాము క్రాస్ ఓటింగ్ వేయలేదని.. తమ అధిష్టానం ఎవరికి ఓట్లేయమందో వారికే ఓటేశానని మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని తాను దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని తెలిపారు. జగన్ కోసం 2012లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే బాగా బుద్ధి చెప్పారని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఓట్లను ఆ పార్టీ నేతలే అడగలేదు. వారిద్దరూ తమ పార్టీలో లేరన్నట్టే వ్యవహరించారు. ఎమ్మెల్యేలకు ఇచ్చిన డిన్నర్ కు కూడా వారిద్దరినీ పిలవలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానమే వారిద్దరిని పట్టించుకోని క్రమంలో వారి ఓట్లపై ఎవరికీ సందేహాలు లేవు.
ఇక నలుగురిలో మిగిలిన ఉండవల్లి శ్రీదేవి సంగతి తేలడం లేదు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడుతున్నప్పుడు ఆమె క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్టు పలు మీడియా చానెల్స్ లో కథనాలు ప్రసారమయ్యాయి. ఆ సమయంలో వాటిని ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. తాను ఒక దళిత ఎమ్మెల్యేను, మహిళను కాబట్టే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు.
తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల రోజు మార్చి 20 సీఎంను కలిశానని.. తన కుమార్తెను ఆయన ఆశీర్వదించారని ఉండవల్లి శ్రీదేవి అదే రోజు సాయంత్రం మీడియా చానెళ్లతో చెప్పారు. తనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చింది జగనన్న అని.. వైసీపీకే తాను ఓటేశానన్నారు.
అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేశాక మేకపాటి చంద్రశేఖరరెడ్డి మీడియా ముందుకొచ్చి తన ఓటు వైసీపీకే వేశానని చెప్పారు. కానీ ఉండవల్లి శ్రీదేవి మాత్రం అడ్రస్ లేరు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి ఓటేశారని ఆరోపిస్తూ ఆమె నియోజకవర్గంలో పలు చోట్ల, గుంటూరులో శ్రీదేవి కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అంతేకాకుండా ఆమె దిష్టిబొమ్మలను దహనం చేశారు. శ్రీదేవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయినా ఆమె మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వలేకపోయారు.
శ్రీదేవి ఫోన్ స్విచ్ఛాప్ లో ఉందని.. ఆమె హైదరాబాద్ కు వెళ్లిపోయారని అంటున్నారు. మార్చి 24న శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సైతం శ్రీదేవి హాజరుకాలేదు. అటు మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా హాజరవ్వలేదు. అయితే తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక మేకపాటి వివరణ ఇచ్చారు కానీ ఉండవల్లి శ్రీదేవి మాత్రం అడ్రస్ లేరు. ఈ నేపథ్యంలో ఆమె టీడీపీకి ఓటేసి ఉండకపోతే మీడియా ముందుకొచ్చి తమ పార్టీ నేతల విమర్శలను ఖండించవచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.