వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత.. కరోనాతో 2021 జనవరిలో తండ్రి కూడా..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబానిది ప్రత్యేక చరిత్ర. ఎన్టీఆర్ వీరాభిమానిగా.. చల్లా రామకృష్ణారెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ తరఫున
రాజకీయ ప్రస్థానం సాగించారు. వైఎస్ కు సన్నిహితుడిగా రామకృష్ణారెడ్డికి పేరుండేది. మరోవైపు ఆయన పలుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తనదైన శైలిలో రాజకీయం చేసేవారు. కాగా,
చల్లా రామకృష్ణారెడ్డి దాదాపు రెండేళ్ల కిందట కొవిడ్ తో చనిపోయారు. ఆ సందర్భంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ నేరుగా ఆయన ఇంటికెళ్లి మరీ సంతాపం తెలిపారు. అనతరం ఆయన
కుమారుడు చల్లా భగీరథరెడ్డి (46)ని ఎమ్మెల్సీ చేశారు. వైఎస్ కుటుంబంతో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈ ఉదంతాలు చాటిచెప్పాయి.
చిన్న వయసులోనే..
చల్లా భగీరథరెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో చికిత్స పొందుతూ చనిపోయారు. అనారోగ్యంతో
బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. భగీరథరెడ్డి.. కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో అస్వస్థతతో
ఉన్నారు. ఆదివారం తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడ్డారు. నంద్యాల జిల్లా అవుకులోని స్వగృహం నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తీసుకొచ్చారు.
ఊపిరితిత్తుల్లోకి రక్తస్రావంతో..
కాగా, చల్లా భగీరథరెడ్డికి ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అవుతుండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు.
గురువారం నంద్యాల జిల్లా అవుకులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, చల్లా రామక్రిష్ణారెడ్డికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. గతేడాది
జనవరిలో ఆయన చనిపోయే నాటికి 72 ఏళ్లు. వైఎస్ సమకాలీకుడు కావడంతో ఆయనతో మంచి బాంధవ్యం ఏర్పడింది. అయితే, ఎమ్మెల్సీ అయిన కొంతకాలానికే ఆయన తుదిశ్వాస
విడిచారు. అప్పటికి 2020 డిసెంబరులో కొవిడ్ బారిన పడిన ఆయనను ఆ నెల 13వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. వెంటిలేటర్ పై మూడు వారాలున్నారు. గమనార్హమేమంటే.. అప్పటి
అసెంబ్లీ సెషన్ కు హాజరైన సందర్భంగా చల్లా రామక్రిష్ణారెడ్డికి కొవిడ్ సోకింది. కాగా, అప్పట్లో తండ్రి మరణంతో ఏర్పడిన స్థానాన్ని దక్కించుకున్న భగీరథ రెడ్డి స్వల్ప వ్యవధిలోనే చనిపోవడం
బాధాకరం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.