ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకుపోతోంది. ఇప్పటికే పలు సమస్యలపై దూకుడుగా స్పందిస్తున్న వైసీపీ ఇదే సమయంలో ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక రాజకీయాల పరంగా ప్లీనరీతో రాష్ట్రంలో ఎన్నికల వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ లో జగన్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏపీ రాజధాని విజయవాడ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
అక్టోబర్‌లో జరిగే పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏర్పాట్లపై దృష్టి సారించింది. వైఎస్ జగన్ పాదయాత్ర కార్యక్రమ పర్యవేక్షణ మొత్తం ఏపీ నుంచే జరగాలని పార్టీ భావిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర కార్యాలయం ఇప్పటికే నిర్మాణంలో ఉంది. అయితే ఇది పూర్తవ్వడానికి మరో ఏడాది పట్టనున్నందున తాత్కాలిక కార్యాలయాన్ని వైసీపీ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి విజయదశమి నుంచి కార్యకలాపాల్ని కొనసాగించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. విజయవాడ బందర్ రోడ్డులో మాజీ మంత్రి కొలుసు పార్థసారధికి చెందిన స్థలంలోనే తాత్కాలిక కార్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 28న రాష్ట్ర కార్యాలయ భవనానికి భూమి పూజ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కార్యాలయం ద్వారా వైఎస్ జగన్ పాదయాత్ర కార్యక్రమం మొత్తం విజయవాడ కార్యాలయం నుంచే పర్యవేక్షించడానికి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఇప్పటి వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న పార్టీ అధికారిక కార్యకలాపాలన్నీ ఇకపై విజయవాడ నుంచే నడిపించనున్నట్టు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాల్ని నిర్వహించడం ద్వారా ఇటు పార్టీ శ్రేణులకు దగ్గరవడంతో పాటుగా అటు నవ్యాంధ్రలో రాజధానిలో జరిగే పరిణామాలపై మరింత వేగంగా స్పందించేందుకు వీలు అవుతుందని అంటున్నారు.