ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ.. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. ఇప్పటివరకు వివిధ పథకాల కింద అందిన లబ్ధి గురించి వారికి చెబుతున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారులకు రాసిన లేఖను వారికి అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి తమనే గెలిపించాలని కోరుతున్నారు.
కాగా మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు అడుగడుగనా నిలదీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమకు ప్రభుత్వ పథకాలు అందలేదని.. రోడ్లు బాలేదని.. మురుగు నీరు పోవడం లేదని.. తాగునీరు అందడం లేదని.. ఇప్పటిదాకా వస్తున్న ప్రభుత్వ పథకాలను ఎత్తేశారని ఇలా అనేక సమస్యలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల దృష్టికి తెస్తున్నారు. ఎన్నికల అయిన మూడేళ్ల తర్వాత తాము గుర్తొచ్చామని గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయా సమస్యలపై తమను నిలదీసిన ప్రజలపై ఎమ్మెల్యేలు పలుచోట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సమస్యలపై ప్రశ్నించినవారిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం వంటివి చేస్తున్నారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సమస్యలపై ప్రశ్నిస్తుంటే తమను ప్రతిపక్షాలకు చెందినవారమంటూ ముద్ర వేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూలై 18న సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల పార్టీల అధ్యక్షులు హాజరవుతారు.
ఈ భేటీలో భాగంగా ముఖ్యమంత్రి జగన్.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వారికి దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. ఏప్రిల్ 11న ప్రారంభమైన కార్యక్రమం ఎనిమిది నెలలపాటు నిర్వహించాలని జగన్ గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు వస్తున్న స్పందన.. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం తదితరాలను సమీక్షించి, మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారని సమాచారం. అలాగే ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలు, వారి ఆగ్రహం.. అందుకు ప్రజాప్రతినిధులు స్పందించిన తీరుపై ఎమ్మెల్యేలకు క్లాసు తీసుకుంటారని చెబుతున్నారు.