ఏపీ అధికార పక్ష నేతలకు ఈ మధ్యన ఏదీ కలిసి రావటం లేదు. వారి ప్రధాన అస్త్రమైన దూకుడుతనం ఇప్పుడు వారికి వరుస ఎదురుదెబ్బల్ని తెచ్చి పెడుతుంది. రాజకీయ ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడటం ద్వారా వారి మీద అధిక్యతను ప్రదర్శించే వ్యూహాం బాగానే ఉన్నా.. మోతాదు మించితే ఏదైనా సరే వెగటు పుడుతుందన్న విషయాన్ని వారు మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆట మొదలు వ్యూహాత్మకంగా మొదలైనా.. దాన్ని కంటిన్యూ చేసే విషయంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలు అదుపు తప్పటం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.
వైసీపీ అన్నంతనే అందరికి గుర్తుకు వచ్చే నేతల్లో మంత్రి కొడాలి నాని.. టీడీపీ రెబల్ నేత వల్లభనేని వంశీ.. ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మంత్రి అనిల్ కుమార్ ముఖ్యులు. నిజానికి వీరి కంటే తోపులు.. విపక్షంలో వైసీపీ ఉన్న వేళలో.. పార్టీకి ముఖంగా ఉన్న నేతలు పలువురు ఉన్నారు. వారిలో.. ఆర్కే రోజా.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. భూమా కరుణాకర్ రెడ్డి.. గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బొత్స సత్యనారాయణ తదితర నేతలు ఉన్నారు.
అధికారం లేనప్పుడు జగన్ కు అండగా నిలిచి.. నాటి అధికారపక్షంపై యుద్ధం చేసిన ఈ నేతలు.. ఇప్పుడు పెద్దగా కనిపించని పరిస్థితి. ఎందుకిలా? అన్నది ప్రశ్న. దీనికి కారణం.. కొడాలి..వల్లభనేని.. అంబటి.. అనిల్ స్థాయిలో తాము మాట్లాడలేమని.. ఆ తరహా రాజకీయాలు వారికింకా వంట బట్టకపోవటమే అన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శను ఎప్పుడూ తప్పు పడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి విలువల్ని వదిలేసి చాలా కాలమే అయ్యింది. అయితే.. సమస్యల్లా.. వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల లక్ష్యం గురి తప్పటమేనని చెప్పాలి.
మొదట్నించి చంద్రబాబును టార్గెట్ చేయటం ద్వారా.. ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేయటం ద్వారా.. బాబు ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చేలా చేయటంతో అప్పటి వైసీపీ నేతలు వ్యవహరిస్తే..పవర్ లోకి వచ్చిన తర్వాత తెర మీదకు వచ్చిన ఫైర్ బ్రాండ్ నేతలు బాబుతో పాటు ఇతరుల్ని టార్గెట్ చేయటం కనిపిస్తుంది. నిజానికి అదే పెద్ద ఫెయిల్యూర్ ఫార్ములాగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చంద్రబాబును తిట్టినా.. వేలెత్తి చూపించినా.. ఆ తీరు తప్పు అన్న మాట ఎవరి నోటి నుంచి రాదు.
ఎందుకంటే.. తెలుగు రాజకీయాల్ని దిగజార్చిన విషయంలో బాబు పాత్ర అంతో ఇంతో ఉండటమే. దీనికి తోడు.. తన మీద పడే మచ్చల్ని ఆయన తుడిచేసుకునే విషయంలో వ్యవహరించిన అలసత్వానికి ఇప్పుడాయన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లను ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారన్న లేబులింగ్ ను తుడిపేసుకునే విషయంలో బాబు పెద్దగా పట్టించుకోలేదు. చివరికి అదే ఆయనకు శాపంగా మారింది.
నిజంగానే.. చంద్రబాబు సొంత మామకు వెన్నుపోటు పొడిచారన్న మాటనే నిజమని అనుకుందాం. అదే నిజమైతే.. ఎన్టీఆర్ ను దెబ్బేసిన నాదెండ్ల భాస్కర్ రావును నెల రోజుల్లోదింపేసిన తెలుగోళ్లు.. చంద్రబాబు నెత్తిన పెట్టుకోవటమే కాదు.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించటం ఎలా సాధ్యమవుతుంది. ఘోరాతి ఘోరమైన వెన్నుపోటు నేరానికి ప్రజలు ఎప్పుడో శిక్ష విధించి ఉండాలి కదా? కానీ.. అదేమీ జరగలేదంటే.. నాడు జరిగిన దానికి ప్రజల ఆమోదం ఉందన్నది నిజం. కానీ.. ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. అందుకు మూల్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు.
అదేరీతిలో.. తమ దూకుడుతనంతో ఏపీ ప్రజల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న వైసీపీ నేతలంతా.. వారిటార్గెట్ చంద్రబాబు..ఆయన కుమారుడు లోకేశ్ వరకు పరిమితమైనంత వరకు బాగానే ఉంది. కానీ.. ఎప్పుడైతే గీత దాటి.. అందరిని ఒకే గాటున కట్టేసి.. మాటలతో ఉతికి ఆరేస్తున్నారో అప్పటి నుంచి వ్యతిరేకత వచ్చిందన్న విషయాన్ని వైసీపీ నేతలు ఎప్పటికి గుర్తిస్తారో? ఇప్పటికైనా ఆ తప్పును దిద్దుకోకపోతే మూల్యం చెల్లించక తప్పదు. అందుకు కాలమే సాక్ష్యంగా మారుతుందన్నది నిజం.