''అంతన్నారు.. ఇంతన్నారు..'' చివరకు ప్రత్యర్థుల చేతిలో అస్త్రమయ్యేసరికి ఫ్లేటు ఫిరాయించారు. మన వైఎస్ఆర్ టీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాలుక మడతెట్టేశారు. మొన్నటికి మొన్న అన్న జగన్ తో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో జరిగిన ఇంటర్వ్యూలో 'ఓపెన్ హార్ట్'గానే షర్మిల బదులిచ్చింది. ఈ మేరకు బహిరంగంగా ప్రకటించారు.
జగన్ తో విభేదాలు ఉన్న విషయాన్ని ఆర్కే ముందు సూత్రప్రాయంగా అంగీకరించిన వైఎస్ షర్మిల నాడు దాన్ని సమర్థించుకునేలా మాట్లాడారు. ఒక కుటుంబం అన్నాక గొడవలు ఉండవా? మీ ఇంట్లో లేవా? అని రాధాకృష్ణనే నాడు ప్రశ్నించారు. వైఎస్ వర్ధంతి రోజు మాట్లాడుకోని విషయాలు.. తండ్రి సంపాదించిన ఆస్తుల్లో సగం తతనకు వాటా ఉందని కూడా షర్మిల ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పరోక్షంగా జగన్ తో కొన్ని వివాదాలు ఉన్న మాట వాస్తవమే అన్నట్టుగా తెలిపారు.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 'అన్న జగన్ తో పంచాయితీ ఉంటే ఆంధ్రాలో పార్టీలో పెట్టాలి కానీ.. తెలంగాణలో ఏంది?' అంటూ షర్మిల గాలి తీసేలా మాట్లాడారు. అవి తెలంగాణ రాజకీయాల్లో వైరల్ అయ్యాయి. పెనుదుమారం రేపాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా కేటీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
'నాకు.. మా అన్నకు ఎలాంటి విభేదాలు లేవు. విభేదాలు ఉంటే ఆంధ్రాలో పార్టీ పెడతా కానీ ఇక్కడెందుకు పెడుతాను. కేటీఆర్ అయ్య కేసీఆర్ దిక్కుమాలిన పనుల వల్లే మేం తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చింది' అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
అయితే నాడు ఏబీఎన్ ఆర్కే ఇంటర్వ్యూలో కొన్ని గొడవలు ఉన్న మాట వాస్తవమేనని పరోక్షంగా ఒప్పుకున్నారు. దాన్నే కేటీఆర్ విమర్శించేసరికి షర్మిల డిఫెన్స్ లో పడిపోయారు. దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకప్పుడు సమైక్యాంధ్ర అని.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమించిన చరిత్ర వైఎస్ షర్మిల సొంతం.. ఇప్పుడేమో పార్టీ పెట్టి జైతెలంగాణ అంటోంది. నాడు అన్నతో విభేదాలున్నాయని ఒప్పుకొని నేడు మాట మార్చేసింది.
ఇలా విమర్శలు చెలరేగగానే మాటల మారుస్తూ వైఎస్ షర్మిల డిఫెన్స్ లో పడుతోంది. కేటీఆర్ విమర్శలకు ఏం చెప్పాలో తెలియక ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది. షర్మిల అన్న మాటలనే కేటీఆర్ అన్నాడు. వాటిని ఇప్పుడు ఖండించకపోగా.. తనకు అన్న జగన్ కు విభేదాలు లేవని అంటోంది.
కానీ ఇప్పటికీ జగన్ తో నేరుగా కలవకుండా షర్మిల దూరంగా ఉంటోంది. జగన్ తో మాట ముచ్చట కూడా లేకుండా సాగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులు దీన్నే ఆయుధంగా చేసుకొని విమర్శించే సరికి ఏం మాట్లాడాలో పాలుపోక ఇలా నాలుక మడతేసి మసిపూసి మారేడు కాయా చేసేలా వ్యాఖ్యానిస్తోంది. జగన్ తో విభేదాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.