టీ20 ప్రపంచకప్ లో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. పసికూన జింబాబ్వే బలమైన పాకిస్తాన్ ను నిన్న ఓడించి టోర్నీలోనే పెను ప్రకంపనలు సృష్టించింది. మొన్న ఐర్లాండ్ కూడా బలమైన ఇంగ్లండ్ ను మట్టికరిపించింది. చిన్నజట్లు పెద్ద జట్లకు షాకిస్తున్న వైనం టోర్నీని మరింత రంజుగా మార్చేస్తోంది. సెమీస్ రేసును క్లిష్టతరం చేస్తున్నాయి.
పాకిస్తాన్ పై ఒకే ఒక పరుగుతో జింబాబ్వే గెలిచి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రాజా పాక్ కు చుక్కలు చూపించాడు. 3 కీలక వికెట్లు తీసి పాక్ నడ్డి విరిచాడు.
పాకిస్తాన్ పై జింబాబ్వే సాధించిన ఈ విజయం క్రికెట్ ప్రపంచంలోనే సెను సంచలనమైంది. క్వాలిఫైయర్స్ లో టైటిల్ ఫేవరేట్ అయిన వెస్టిండీస్ ను ఓడించిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. జింబాబ్వే ప్లేయర్లు చూపించిన తెగువకు ప్రశంసలు కురుస్తున్నాయి. పాకిస్తాన్ ఓడిపోవడంతో భారత్ లోనూ సెలబ్రేషన్స్ మిన్నంటాయి. జింబాబ్వే జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్.
ఈ మ్యాచ్ అనంతరం టాప్ కమెడియన్ మిస్టర్ బీన్అలియాస్ రొవాన్ అట్కిన్సన్ పేరుతో ట్రెండింగ్ లోకి వచ్చింది. మిస్టర్ బీన్ పదాన్ని స్వయంగా జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ఎంనంగగ్వా సైతం ఉపయోగించాడంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం లేకపోలేదు.
2016లో జింబాబ్వే రాజధాని హరారెలో నిర్వహించిన ఓ కామెడీ షలో జింబాబ్వే ప్రజలను అవమానించింది పాకిస్తాన్. మిస్టర్ బీన్ ను పోలిన పాకిస్తాన్ కమెడియన్ ఆసిఫ్ మహ్మద్ పర్ ఫామెన్స్ ఇచ్చాడు. అతడిని రియల్ మిస్టర్ బీన్ అనుకున్నారు జింబాబ్వే ప్రజలు. అతడితో చేతులు కలపడానికి, ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. దీనికోసం 10 డాలర్లను చెల్లించారు. ఆ తర్వాత నిజం తెలిసి లబోదిబోమన్నారు.
దీనికి జింబాబ్వే ప్రతీకారం తీర్చుకున్నట్టుంది. నెక్ట్స్ టైం రియల్ మిస్టర్ బీన్ను పంపించాలంటూ జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ కు చురకలు అంటించారు. తమ దేశం సాధించిన విజయం పట్ల ఆయన స్పందించారు. క్రెగ్ ఇర్విన్ సారథ్యంలో జింబాబ్వే జట్టును అభినందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View