ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పడింది. ఇక్కడ గత ఎన్నికల్లో పేర్ని నాని విజయం దక్కించుకున్నారు. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కొల్లు రవీంద్ర గెలిచి.. మంత్రి అయ్యారు. ఇక, పేర్ని నాని కూడా జగన్ తొలి కేబినెట్‌లో సీటు దక్కించుకున్నారు. అయితే.. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వారు.. 2014-2022 వరకు మంత్రులుగా ఉన్నారు. సో.. దీనిని బట్టి.. ఇక్కడి ప్రజలు చాలానే ఆశించారు. ఒకరిని మించి ఒకరు ఇక్కడ పనిచేస్తారని అనుకున్నారు.
పోటా పోటీగా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని భావించారు. కానీ, అది ఎక్కడా కనిపించడం లేదు. అం తో ఇంతో గత మంత్రి కొల్లు రవీంద్ర డెవలప్ చేశారనేపేరుంది. ఇక, పేర్ని విషయంలో మాత్రం అది కూ డా వినిపించడం లేదు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు.
మంత్రిగా ఉన్న కారణంతో నియోజకవ ర్గంపై దృష్టి పెట్టలేక పోయానని తెలిపారు. అయితే.. ఇప్పుడు మంత్రికాదు కాబట్టి..వచ్చే రెండేళ్లపాటు ఆయన విజృంభిస్తారని అనుకున్నా.. అది కూడా కనిపించడం లేదు.
ఎందుకంటే.. ఇటీవల నాని దగ్గరకు స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కొందరు వెళ్లారు. పార్కు.. సహా డంపింగ్ యార్డ్ వంటివాటిని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే.. ఆయన నవ్వి ఊరుకున్నారట. అంతేకాదు.. పరిస్థితి మీకు తెలిసి కూడా ఇలా అడుగడం బాగోలేదని.. కాఫీ ఇచ్చి పంపించేశారట. దీంతో నాని విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. కొల్లు రవీంద్ర పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించ డం లేదనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలోనూ ఆయన పెద్దగా దూకుడు ప్రదర్శించడం లేదు.
దీంతో ఏదైనా సమస్య చెప్పుకుందామని వెళ్తున్న వారికి.. ఆయన పీఏలు.. దర్శనమిస్తున్నారు. కట్ చేస్తే.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయా పార్టీల నుంచి వీరిద్దరే పోటీ చేయనున్నారు. దీంతో ఇద్దరి విషయంలో పోటీ ఎలా ఉంటుంది? అనేది చర్చకు వస్తోంది. ఎవరి విషయంలోనూ ఇక్కడి ప్రజలు సానుకూలంగా అయితే లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ.. ప్రత్యామ్నాయం లేకపోవడంతో.. పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ప్రభుత్వ పథకాలు.. తమ నాయకుడిని గట్టెక్కిస్తాయని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తనను గెలిపిస్తుందని కొల్లు అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు.. మచిలీపట్నం పాలిటిక్స్‌ను వేడెక్కిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.