భర్తకి కరోనా .. నోటి ద్వారా ఆక్సిజన్ అందించిన భార్య !

Update: 2021-04-26 11:52 GMT
దేశంలో ప్రతి రోజూ లక్షల్లో కరోనా కేసలు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రాణాలుకోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రల్లో బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిన సంఘటన కన్నీరు పెట్టిస్తోంది. కరోనా సోకి శ్వాస ఆడక, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకోవడం కోసం భార్య తన నోటితో శ్వాస అందిస్తూ బతికించుకునే ప్రయత్నం చేసింది. అయినా భర్తను కాపాడుకోలేకపోయింది. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే .. కరోనా వైరస్ బారిని పడిన భర్త శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అయితే, బెడ్లు ఖాళీ లేవని వారిని ఏ ఆస్పత్రిలో కూడా చేర్చుకోలేదు. ఈ లోపు బాధితుడి పరిస్థితి విషమించసాగింది. దీనితో ప్రమాదం అని తెలిసి కూడా భార్య తన నోటి ద్వారా భర్తకు శ్వాస అందించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నం వృథా అయ్యింది. చివరకు ఆ వ్యక్తి భార్య ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. ఆగ్రా వికాస్‌ సెక్టార్‌ 7కు చెందిన రవి సింఘాల్‌ కోవిడ్‌ బారిన పడ్డాడు. దాంతో అతడి భార్య రేణు సింఘాల్‌, రవి సింఘాల్‌ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ బెడ్స్‌ ఖాళీగా లేకపోవడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. ఈలోపు రవి సింఘాల్‌ కు ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తింది.

దీనితో రేణు సింఘాల్‌ అతడిని సరోజిని నాయుడు మెడికల్‌ కాలేజీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఆటోలో ఎక్కి ఆస్పత్రి వెళ్తుండగా అతడి పరిస్థితి చేయి దాటిపోసాగాంది. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడసాగాడు. దాంతో ప్రమాదం అని తెలిసి కూడా రేణు సింఘాల్‌ అతడికి నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసిది. కానీ అవేవి ఫలించలేదు. ఆస్పత్రికి చేరుకునేలోగానే అతడు ఆటోలోనే భార్య ఒడిలో కన్ను మూశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తనకు ప్రమాదం అని తెలిసి కూడా భర్త ప్రాణాల కోసం రేణు సింఘాల్‌ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.

Tags:    

Similar News