ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే ఇంతే.. టీమిండియా పై నోరుపారేసుకున్న అఫ్రీదీ!

వరుస ఓటములు ఎదుర్కొని లీగ్ దశలోనే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది పాకిస్థాన్. ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ పై ఇంటా బయటా తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే.

Update: 2023-11-20 04:48 GMT

వరుస ఓటములు ఎదుర్కొని లీగ్ దశలోనే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది పాకిస్థాన్. ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ పై ఇంటా బయటా తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర పెర్ఫార్మెన్స్ కు బాధ్యత వహిస్తున్నట్లుగా బాబర్ ఆజాం తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇక ఆ దేశానికే చెందిన పలువురు మాజీలు ప్రస్తుత టీం ను ఒక ఆటాడుకున్నారు.

మరోవైపు భారత్ ఫైనల్స్‌ కు చేరుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా టాస్ గెలవడంతో భారత్ బ్యాటింగ్‌ కు దిగింది. ఈ క్రమంలో భారత బ్యాటర్లను ఆసిస్ బౌలర్లు కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ నేపథ్యంలో మంచి స్కోర్ కోసం ప్రయత్నించిన భారత్ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది.

ఈ సమయంలో... క్రికెట్ విశ్లేషకుడిగా పాక్ టీవీ ప్రేక్షకుల ముందుకొచ్చిన మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ టీం ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కుకున్నాడు. భారత్ ఆటగాళ్ల ఓవర్ కాన్ ఫిడెన్సే ఇందుకు కారణం అని వ్యాఖ్యానించాడు. భారత్ ఆటగాళ్ల వికెట్లు పడుతున్న సమయంలో అఫ్రీదీ ఈ వ్యాఖ్యలు చేయడంతో పుండుపై కారం చల్లినట్లుగా ఇండియా క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. ఆన్ లైన్ వేదికగా ఓ ఆటాడుకున్నారు.

ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్‌ లో భారత్ ఆటతీరును విశ్లేషిస్తూ అఫ్రిది... "జబ్ ఆప్ కంటిన్యూ గేం జీతే జా రహే హో తో ఓవర్ కాన్ఫిడెన్స్ భీ జ్యాదా హో జాతి హై. టో వో చీజ్ ఆప్కో మార్వా దేతీ హై (అన్ని మ్యాచ్ లనూ నిరంతరంగా గెలిచినప్పుడు, అతి విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వారి పతనానికి దారితీయవచ్చు)" అని వ్యాఖ్యానించాడు. దీంతో ఇవి విశ్లేషణ తాలూకు వ్యాఖ్యలు కాదు.. కడుపుమంట తాలూకు ప్రతిస్పందనలు అని అంటున్నారు నెటిజన్లు!

Tags:    

Similar News