రెజ్లర్ అమన్‌ వేటు నుంచి జస్ట్ మిస్సా?... 10 గంటల్లో జరిగిందిదే!

అవును... వినేశ్ ఫోగాట్ అనర్హత వేటు వ్యవహారం ఇచ్చిన షాక్ నేపథ్యంలో మరో రెజ్లర్ అమన్ సెహ్రావత్ మేనేజ్మెంట్ అలర్ట్ అయ్యిందని అంటున్నారు.

Update: 2024-08-10 08:44 GMT

పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పతకం సాధించే అవకాశం కోల్పోయిన సంగతి తెలిసిందే. 100 గ్రాములు అధిక బరువు ఉన్నారని చెబుతూ ఆమెపై అనర్హత వేటు వేశారు. ఆ షాక్ నుంచి భారత్ ఇప్పట్లో తేరుకునేలా లేదని అంటున్నారు. ఈ సమయంలో మరో రెజ్లర్ అమన్ సెహ్రావత్ కి సంబంధించిన కీలక విషయం తెరపైకి వచ్చింది.

అవును... వినేశ్ ఫోగాట్ అనర్హత వేటు వ్యవహారం ఇచ్చిన షాక్ నేపథ్యంలో మరో రెజ్లర్ అమన్ సెహ్రావత్ మేనేజ్మెంట్ అలర్ట్ అయ్యిందని అంటున్నారు. ఇందులో భాగంగా... కాంస్య పోరు కోసం బరిలోకి దిగిన అమన్ బరువుపై శ్రద్ధ తీసుకొన్నట్లు రెజ్లింగ్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కిలోల బరువు తగ్గాడని చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే.. సెమీస్ లో ఓటమి తర్వాత గురువారం నాడు అమన్ బరువు 61.5 కేజీలు ఉందంట. దీంతో... శుక్రవారం రాత్రి జరిగిన కాంస్య పోరు నాటికి అతడి బరువు 57 కేజీలకు వచ్చిందని చెబుతున్నారు. దీనికోసం అతడు కఠినంగా శ్రమించాడని.. ఫలితంగా కేవలం 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గాడని.. దీని కోసం కోచ్ లతో పాటు ఆరుగురు బృందం కష్టపడిందని చెబుతున్నారు.

ఈ సమయంలో భారత బృందం అమన్ ను గంటపాటు వేడినీళ్ల స్నానం, గంటసేపు ఆగకుండా ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేయించారంట. అనంతరం జిమ్ కు తీసుకెళ్లి కఠినమైన కసరత్తులు చేయించారట. అదే క్రమంలో ఐదు సెషన్స్ పాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్ చేయించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చివరి సెషన్ నాటికి అతడు 900 గ్రాముల అధిక బరువు ఉన్నట్లు కోచ్ లు గురించారంట.

ఆ తర్వాత 15 నిమిషాల పాటు నెమ్మదిగా జాగింగ్ చేయమని ఆమన్ కు సూచించారంట. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 4:30 నాటికి అమన్ బరువు పోటి పడిన 57 కేజీల కంటే వంద గ్రాములు తక్కువగా 56.9 కేజీలకు చేరిందంట. దీంతో.. భారత బృందం ఊపిరి పీల్చుకుందని అంటున్నారు.

Tags:    

Similar News