ధోని మీద సెటైర్లే సెటైర్లు!

Update: 2015-07-05 09:49 GMT
ఒకప్పుడు ధోని ప్రపంచవ్యాప్తంగా మాజీ క్రికెటర్లందరికీ ఫేవరెట్‌ కెప్టెన్‌. అతణ్ని మించిన నాయకుడు లేడంటూ పొగడ్తల వర్షం కురిపించేవాళ్లు. కానీ అప్పుడు అతణ్ని పొగిడిన నోళ్లే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనికి ధోని ఫెయిల్యూర్స్‌ ఓ కారణమైతే.. ఎన్నడూ లేని విధంగా అతను నోరు జారుతుండటం.. అసహనానికి గురవుతుండటం మరో కారణం. మొన్న బంగ్లాదేశ్‌ చేతిలో సిరీస్‌ ఓటమి నేపథ్యంలో ధోని చాలా ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు. అవసరమైతే రాజీనామా చేస్తా.. ఇలాంటి చెత్త బౌలర్లుంటే ఎలా గెలవాలి.. అంటూ అసహనం వ్యక్తం చేశాడు. గతంలో ఫెయిల్యూర్స్‌ ఎదురైనా చాలా ప్రశాంతంగా కనిపించేవాడు, మాట్లాడేవాడు ధోని. కానీ ఇప్పుడలా కనిపించడం లేదు.

అందుకే ధోని యోగా చేస్తే మంచిదంటూ మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడి సెటైర్‌ వేస్తే.. మరో మాజీ కెప్టెన్‌ ధోని బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడన్నాడు. తాజాగా వెస్టిండీస్‌ పేస్‌ దిగ్గజం ఆండీ రాబర్ట్స్‌ కూడా ధోని మీద విమర్శలు గుప్పించాడు. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో విఫలమైన ఉమేశ్‌ యాదవ్‌ను ధోనిని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ''ఉమేశ్‌ యాదవ్‌ వేగం మీద దృష్టిపెడుతూ.. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను పట్టించుకోవడం లేదని ధోని అంటున్నాడు. ఐతే ఫాస్ట్‌బౌలర్‌కు అన్నింటికంటే ముఖ్యమైంది వేగమే. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ కోసం పేస్‌ను త్యాగం చేయాలని చెప్పడం తప్పు. ఉమేశ్‌ ఇండియాలో నిజమైన ఫాస్ట్‌బౌలర్‌. పేస్‌ అతడి ఆయుధం. ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ జాన్సన్‌ను చూడండి. మధ్యలో ఇబ్బంది పడ్డా.. చాలా స్ట్రాంగ్‌గా తయారై వచ్చాడు. అతడికి వేగమే బలం. దాంతోనే ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. జట్టును గెలిపిస్తున్నాడు. ఉమేశ్‌ కూడా అదే చేయాలి. కొంచెం నియంత్రణతో మరింత వేగంగా బౌలింగ్‌ చేయడానికి ప్రయత్నించాలి'' అన్నాడు రాబర్ట్స్‌.

Tags:    

Similar News