వన్డే సీరిస్ ను సొంతం చేసుకున్న టీమిండియా

Update: 2015-07-12 22:44 GMT
గత రెండు రోజులుగా క్రీడా రంగానికి సంబంధించిన అద్భుత విజయాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఒకటి తర్వాత ఒకటిగా విజయాలు సాధిస్తూ.. భారత్ కీర్తి పతాకం విను వీధుల్లో సగర్వంగా ఎగిరే పరిస్థితి.

జింబాబ్వేతో జరిగిన మూడు వన్డే ల సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వేలో సాగుతున్న వన్డే సిరీస్ లో తాజాగా రెండో మ్యాచ్ హరారేలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత బ్యాటింగ్ లో ఓపెన్లరు రహానె.. మురళీ విజయ్ లు జట్టుకు చక్కటి స్కోర్ అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 112 పరుగులు చేయటంతో అలవోకగా భారీ స్కోర్ సాధ్యమైంది. ఓపెనర్లతో పాటు.. రాయుడు.. మనోజ్ తివారీలు సైతం స్పందించటంతో భారత్ ఎనిమిది వికెట్లకు 271 పరుగులు చేసింది.

అనంతరం 272 విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టను భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు తీసి వెన్ను విరిచారు. ఇక.. కులకర్ణి.. హర్భజన్ సింగ్.. స్టువర్ట్ బిన్నీ.. అక్షర్ పటేల్ కు చెరో వికెట్ తీయటంతో 49 ఓవర్ల వ్యవధిలో కేవలం 209 పరుగులకే అలౌట్ అయి.. పరాజయం పాలైంది.
Tags:    

Similar News