బీసీసీఐకు వందలాది కోట్ల రూపాయిల్ని తెచ్చి పెడుతున్న ఐపీఎల్ మీద పాకిస్థాన్ కన్ను పడింది. భారత్‌లోని ఐపీఎల్ మాదిరే తమ దేశంలోనే ఇలాంటిదాన్ని ఒకటి ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కసరత్తు మొదలు పెట్టింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థ ద్వారా ప్రాంఛైజీల వేలం.. ఆటగాళ్ల ఎంపిక ఉంటాయని చెబుతున్నారు.
ఫ్రాంచైజీల విక్రయం.. ప్రసార హక్కులు.. స్పాన్సర్ షిప్ లు ఇలా.. అన్నీ వాణిజ్య అంశాలకు సంబంధించిన వ్యవహారాలు లెక్క తేల్చేందుకు ఈ సెప్టెంబర్ లో బిడ్ లు ఓపెన్ చేయనున్నట్లు చెబుతున్నారు.
పాక్ సూపర్ లీగ్ లో మొత్తం ఐదు జట్లు ఉండొచ్చని వాదన వినిపిస్తోంది. ఒక్కో జట్టులో 16 మంది సభ్యులు ఉంటారని.. ప్రారంభంలో ఐదు జట్లతో మొదలు పెట్టి.. దాని ఆదరణ ఆధారంగా భవిష్యత్తు లో నిర్ణయాలు ఉంటాయంటున్నారు. ఇక.. మొదటి ఎడిషన్ ను ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.
ఇక.. వీటికి వేదిక దోహా.. ఖతర్ లలో ఉండొచ్చని చెబుతున్నారు. ప్రతి జట్టులోని 16 మంది సభ్యుల్లో నలుగురు లేదంటే ఐదుగురు ఆటగాళ్లు విదేశీయులు ఉండొచ్చని చెబుతున్నారు. మరి.. బీసీసీఐకి కాసులు కురిపించిన ఐపీఎల్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాలి.