ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రపంచ ఛాంపియన్ ఆస్ర్టేలియా సరికొత్త చెత్త రికార్డును క్రియేట్ చేసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే యాషెన్ సీరీస్‌లో పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తోంది. గురువారం నాటింగ్‌హోమ్‌లో ప్రారంభమైన నాల్గో టెస్టు తొలి రోజు లంచ్ లోపే 60 పరుగులకు చాప చుట్టేసింది. ఇంగ్లండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ విజృంభణతో ఒకానొక దశలో ఆసీస్ 47 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 50 పరుగులైనా చేస్తుందా అన్న స్థితిలో ఉంది. చివరకు 60 పరుగులకు ఆలవుట్ అయ్యింది.
ఒక ఇన్నింగ్స్‌లో ఆసీస్ 60 కంటే తక్కువ పరుగులకు ఆలవుట్ అవ్వడం ఇది ఆరోసారి. ఈ చెత్త రికార్డు కూడా ఆసీస్ తన పేరిటే లఖించుకుంది. బ్రాడ్ దెబ్బకు ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ గింగరాలు తిరిగారు. తొమ్మిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా...బౌలర్ మిచెల్ జాన్సన్ చేసిన 13 పరుగులే అత్యధిక స్కోరు. మరో విచిత్రం ఏంటంటే ఆసీస్ ఇన్సింగ్స్ లో అందరికంటే ఎక్కువగా ఎక్స్‌ట్రాల రూపంలో 14 పరుగులు వచ్చాయి.
ఇంగ్లండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ కేరీర్‌లోనే మరోసారి టాప్ గణాంకాలు నమోదు చేశాడు. 15 పరుగులకు 8 వికెట్లు తీశాడు. 83వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బ్రాడ్ ఈ మ్యాచ్‌తో 300 వికెట్ల క్లబ్లో చేరాడు.ఈ ఘనత సాధించిన ఐదో ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డుల కెక్కాడు. తాజాగా ఈ ప్రదర్శనతో బ్రాడ్ క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సెన్సేషన్ అయ్యాడు. ఆసీస్ చెత్త రికార్డు నమోదు చేయడంతో ఆ దేశంలో క్రికెటర్లపై నిరసన ప్రదర్శనలు జరుగుతుండగా..ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా ఆసీస్ 2-1 తేడాతో వెనకంజలో ఉంది. ఈ టెస్టులో ఓడిపోతే యాషెన్ కోల్పోయినట్టే. ఈ మ్యాచ్‌లో ఏదైనా చెప్పలేని అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లండ్ ఓడిపోవడం అసాధ్యం.