వరల్డ్‌కప్ విజేత ఆసీస్...ఫైనల్ లో భారత్ చిత్తు
ఇలా వరసగా ఆరవసారి వన్డే వరల్డ్‌కప్ కైవసం చేసుకున్న ఆసీస్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. అంతే కాదు ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి క్రికెట్ లో ప్రపంచ విజేత అయింది.
సెంటిమెంట్లూ యాంటీ సెంటిమెంట్లూ ఎన్నో కూడికలు తీసివేతలు, జాతకాలు జోస్యాలు అన్నీ చూసుకుని బరిలోకి దిగినా కూడా భారత్ చిత్తు కాక తప్పింది కాదు, ఆస్ట్రేలియా చేతుల్లో భారత్ ఓటమిని చవి చూసింది. టోటల్ గా చూస్తే మొత్తం వండే వరల్డ్ కప్ ని ఆస్ట్రేలియా కైవశం చేసుకుంది.
ఇలా వరసగా ఆరవసారి వన్డే వరల్డ్‌కప్ కైవసం చేసుకున్న ఆసీస్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. అంతే కాదు ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి క్రికెట్ లో ప్రపంచ విజేత అయింది. అలా భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో ఆసిస్ గెలిచింది.
ఒక విధంగా చెప్పాలీ అంటే భారత్ ని ఆస్ట్రేలియా చిత్తుగానే ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ కి యాంటీ సెంటిమెంట్ కూడా కలసి రాలేదు. టాస్ గెలిచిన టీం ఓడిపోతుంది అన్న యాంటీ సెంటిమెంట్ ని సైతం పక్కన పెట్టేసి ఆసిస్ కప్ ని ఎగరేసుకుని పోయింది.
ఇక బ్యాటింగ్ కి దిగిన భారత్ మొదట్లోనే తడబడింది. యాభై నిర్ణీత ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేసింది. ఇక 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట్లో మూడు వికెట్లు కోల్పోయినా నిలకడగా ఆడి భారత్ ని పూర్తిగా కంట్రోల్ చేసింది.
ఆసీస్ ఓపెనర్ చేదనలో 137 పరుగులతో అద్భుతమైన బ్యాటింగ్ ఆడి గెలుపుని పూర్తిగా ఆస్ట్రేలియా వైపుగా నడిపించేశారు. ఇక అతనికి తోడుగా ఉన్న లబూషేన్ 58 పరుగులతో ధీటుగా రాణించాడు. మొదట్లో ఏడు ఓవర్లకే మూడు వికెట్లు తీసిన భారత్ ఒక దశలో గెలుపు ఆశలను పెంచింది.
కానీ ఆ తరువాత మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. దీంతో మరో అరు వికెట్లు ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే ఆసిస్ గెలిచి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. మొత్తానికి ఎంతో ఉత్కంఠగా మొదలైన వండే వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ మాత్రం చతికిలపడి అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది.