బాబర్అజామ్ ప్రైవేట్ చాట్ బయటకొచ్చింది!

పాక్ క్రికెట్ బోర్డు నుంచి జట్టుకు సరైన సహకారం అందించకపోవటమే కాదు.. ఐదు నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదన్న టాక్ నడుస్తోంది.

Update: 2023-10-31 04:36 GMT

పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఇప్పుడే మాత్రం బాగోలేదు. ప్రపంచ కప్ టోర్నీలో భారీ అంచనాలతో దిగిన ఆ జట్టుకు తగులుతున్న ఎదురుదెబ్బలు అన్ని ఇన్ని కావు. పసికూనల మీద కూడా చిత్తుగా ఓడుతోంది. మొత్తం ఆరు మ్యాచులు అడితే రెండింటిలో తప్పించి.. మిగిలిన నాలుగింటిలోనూ విఫలం కావటం గమనార్హం. దీంతో.. అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత అతడి కెప్టెన్సీ మీద వేటు పడుతుందన్న మాట వినిపించటం.. అందుకు తగ్గట్లే పీసీబీ కూడా ఆ దిశగా ప్రకటన వచ్చింది.

పాక్ క్రికెట్ బోర్డు నుంచి జట్టుకు సరైన సహకారం అందించకపోవటమే కాదు.. ఐదు నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదన్న టాక్ నడుస్తోంది. ఇలాంటివేళ.. పాక్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్ పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ తో మాట్లాడే ప్రయత్నం చేసినా.. ఆయన స్పందించలేదని.. మెసేజ్ కు కూడా రియాక్టు కావట్లేదన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ విషయాన్ని పాక్ జట్టు మాజీ కెప్టెన్ లతీఫ్ రషీద్ ఆరోపించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా పాక్ కెప్టెన్.. పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ కావటం కలకలంగా మారింది. లీకైన చాట్ కు సంబంధించిన అసలు నిజం ఏమిటన్నది తేలాల్సి ఉంది. ఇంతకూ లీకైన వాట్సాప్ చాట్ లో ఏముందన్నది చూస్తే.. ‘బాబర్ అజామ్.. నువ్వు ఫోన్ చేస్తే ఛైర్మన్ స్పందించటం లేదని.. టీవీల్లో.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నువ్వు ఆయనకు ఫోన్ చేశావా? అన్న ప్రశ్నకు పాక్ జట్టు కెప్టెన్ స్పందిస్తూ.. సలామ్ సల్మాన్ భాయ్.. నేను కాల్ చేయలేదన్న రిప్లై ఉన్న వాట్సాప్ మేసేజ్ లీకైంది. ఇదంతా చూస్తే.. పీసీసీ చీఫ్ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే.. బాబర్ అజామ్ ప్రైవేటు చాట్ లీక్ కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అతనిపై జరుగుతున్న కుట్రగా పేర్కొంటున్నారు. పాక్ క్రికెట్ కు విలువైన ఆస్తిని ఏం చేయాలనుకుంటున్నారు? అన్న మాటను పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ లాంటి వారు మండిపడుతున్నారు. కెప్టెన్ కు బాసటగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News