బంగ్లాదేశ్ తదుపరి దాడి భారత్ పైనే.. ఈ నెలలోనే.. బహుపరాక్

గత నెలలో సరిగ్గా ఇదే రోజున బంగ్లాదేశ్ అరాచకం చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేసి వచ్చేశారు షేక్ హసీనా.

Update: 2024-09-04 18:16 GMT

గత నెలలో సరిగ్గా ఇదే రోజున బంగ్లాదేశ్ అరాచకం చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేసి వచ్చేశారు షేక్ హసీనా. అప్పటినుంచి ఆమె భారత్ లోనే ఉంటున్నారు. తొలుత బ్రిటన్ వెళ్లేందుకు ప్రయత్నించినా.. నెల ముందుగా చెప్పలేదంటూ తిరస్కరించింది. ఇక గురువారంతో కచ్చితంగా హసీనా ఆమె చెల్లెలు రెహానా భారత్ చేరి నెల రోజులవుతుంది. మరోవైపు హసీనా దౌత్య పాస్ పోర్టును రద్దు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెను కట్టడి చేస్తోంది. ఇంకోవైపు స్వదేశంలో ఆమెపై 50కిపైగా కేసులు పెట్టింది. వీటిలో హత్య కేసులూ ఉండడం గమనార్హం. అంటే హసీనా బంగ్లాదేశ్ లో కాలుపెట్టగానే ఆమెను అరెస్టు చేసి జైలుకు పపండం ఖాయం. అయితే.. పైన హెడ్డింగ్ లో చెప్పుకొన్నట్లు ఈ కథనం ఉద్దేశం అది కాదు.

ఇక భారత్ తోనే..

ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ పై టెస్టుల్లో చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. అత్యంత కల్లోల పరిస్థితుల మధ్య స్వదేశంలో కనీసం ప్రాక్టీస్ కూడా చేయకుండా పాకిస్థాన్ కు వెళ్లిన బంగ్లా జట్టు ఏకంగా 2-0తో టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. పాకిస్థాన్ పై పది వికెట్లతో పాకిస్థాన్ లో గెలిచిన తొలి జట్టుగా కూడా బంగ్లా రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలోనే వారి తదుపరి సిరీస్ ఏమిటా? అని చూస్తే.. అది భారత్ తోనే ఉంది.

టీమ్ ఇండియా బహు పరాక్

బంగ్లా జోరు చూస్తుంటే టీమ్ ఇండియా బహు పరాక్ అనాల్సిందేనేమో? పాకిస్థాన్ తో అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ ఆ జట్టు పుంజుకుని మ్యాచ్ లు గెలిచింది. కాగా, బంగ్లా ఈ నెలలోనే భారత్ కు రానుంది. రెండు టెస్టులు, మూడు టి20లు ఆడనుంది. తొలి టెస్టు ఈ నెల 19 నుంచి చెన్నైలో, రెండో టెస్టు 27 నుంచి కాన్పూర్ లో జరుగుతాయి. అక్టోబరు 6, 9, 12 తేదీల్లో మూడు టి20లు ఉన్నాయి. కాగా, ఇటీవల శ్రీలంక పర్యటనలో టి20 సిరీస్ ను గెలుచుకున్న భారత జట్టు వన్డే సిరీస్ ను 2-0తో కోల్పోయిన సంగతి తెలిసిందే. లంకకు వన్డే సిరీస్ అప్పగించడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతోనే భారత్ బహు పరాక్ అని చెప్పాల్సి వస్తోంది. అయితే, భారత్ –బంగ్లా మధ్యన చాలా తేడా ఉంది. పాకిస్థాన్ మంచి ఆటగాళ్లున్న జట్టే అయినా.. వారిలో పట్టుదల, ఫామ్ ఏమీ లేవు. భారత్ మాత్రం అలా కాదు. అయినా.. జాగ్రత్తగా ఉండడం మంచిదే.

Tags:    

Similar News