రోహిత్ శతక్కొట్టినా... చెన్నై సూపర్ విక్టరీ!
ఐపీఎల్ - 2024 సీజన్ లో భాగంగా భారీ మ్యాచ్ ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది.
ఐపీఎల్ - 2024 సీజన్ లో భాగంగా భారీ మ్యాచ్ ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన ఈ మ్యాచ్ ఆ అంచనాలకు తగ్గట్లుగానే భారీ స్కోర్లు, భారీ షాట్లతో అలరించింది. ఈ సమయంలో టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. ఈ రసవత్తరమైన మ్యాచ్ ఆధ్యాంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం...!
చెన్నై బ్యాటింగ్ స్టార్ట్:
టాస్ ఓడిన చెన్నై బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా అజింక్య రహానె, రచిన్ రవీంద్ర క్రీజ్ లోకి ఎంటరయ్యారు. ఈ సమయంలో... మహ్మద్ నబీ వేసిన తొలి ఓవర్ లో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో... తొలి ఓవర్ పూర్తయ్యే సరికి చెన్నై స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 6 పరుగులకు చేరింది.
చెన్నై ఫస్ట్ వికెట్ డౌన్!:
గెరాల్డ్ కొయెట్జీ వేసిన 2వ ఓవర్ నాలుగో బంతికి చెన్నైకి షాక్ తగిలింది. ఇందులో భాగంగా... అజింక్య రహానె (5) ఔటయ్యాడు. దీంతో 2 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయిన చెన్నై 9 పరుగులు చేసింది.
పవర్ ప్లే పూర్తయ్యే సరికి పరిస్థితి ఇది!:
మహ్మద్ నబీ వేసిన మూడో ఓవర్ లో 9 పరుగులు.. జస్ ప్రీత్ బుమ్రా వేసిన నాలుగో ఓవర్ లో 6 పరుగులు.. గెరాల్డ్ కొయెట్జీ వేసిన ఐదో ఓవర్ లో 14 పరుగులు.. ఆకాశ్ మధ్వాల్ వేసిన ఆరో ఓవర్లో 10 పరుగులు రావడంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి చెన్నై ఒక వికెట్ నష్టపోయి 48 పరుగులు చేసింది.
చెన్నై రెండో వికెట్ డౌన్!:
చెన్నై 60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ గోపాల్ వేసిన ఎనిమిదో ఓవర్ లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన రచిన్ తర్వాతి బంతికే ఔటయ్యాడు. దీంతో... 8 ఓవర్లకు చెన్నై స్కోరు 2 వికెట్ల నష్టానికి 61 పరుగులకు చేరింది.
33 బంతుల్లో రుతురాజ్ హాఫ్ సెంచరీ!:
కొయెట్జీ వేసిన 13 ఓవర్ లో నాలుగో బంతికి సిక్సర్ బాదడంతో.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 33 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. దీంతో 13 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయిన చెన్నై 110 పరుగులు చేసింది.
శివమ్ దూబె హాఫ్ సెంచరీ!:
చెన్నై బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె లు పోటా పోటీగా బౌడరీలు బాదుతున్నారు. ఈ సమయంలో హార్దిక్ పాండ్య వేసిన 16 ఓవర్ తొలిబంతికి సింగిల్ తీసి శివమ్ దూబె 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే.. ఆ తర్వాతి బంతికి రుతురాజ్ గైక్వాడ్ (69: 40 బంతుల్లో) ఔటయ్యాడు. దీంతో... 16 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై మూడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.
ధోనీ హ్యాట్రిక్ సిక్స్ లు.. ముంబై టార్గెట్ 207!:
ముంబయితో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై భారీ స్కోరు చేసింది. ఇందులో భాగంగా... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చివర్లో ఎంఎస్ ధోనీ (20*: 4 బంతుల్లో) హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. రుతురాజ్ గైక్వాడ్ (69: 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్ లు), శివమ్ దూబె (66*: 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ లు) అర్ధ శతకాలు బాదారు.
ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య 2, శ్రేయస్ గోపాల్, కొయెట్జీ ఒక్కో వికెట్ తీశారు.
లక్ష్యఛేదనకు దిగిన ముంబయి!:
చెన్నై నిర్దేశించిన 207 పరుగుల భారీ టార్గెట్‌ని ఛేదించేందుకు ముంబయి బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు క్రీజ్ లోకి దిగారు. ఈ సమయంలో తుషార్ దేశ్ పాండే వేసిన తొలి ఓవర్లో 5 పరుగులు రాగా... ముస్తాఫిజుర్ వేసిన రెండో ఓవర్ లో 8 పరుగులు వచ్చాయి. ఇక, తుషార్ దేశ్ పాండే వేసిన మూడో ఓవర్ లో 12 పరుగులు.. శార్దూల్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్ లో 13 పరుగులు లభించాయి!
ముస్తాఫిజుర్ వేసిన ఐదో ఓవర్ లో 15 పరుగులు రాగా.. శార్దూల్ ఠాకూర్ వేసిన ఆరో ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి. దీంతో దూకుడుగా ఆడుతున్న ముంబై స్కోరు పవర్ ప్లే పూర్తయ్యే సరికి వికెట్లేమీ నష్టపోకుండా 63 పరుగులకు చేరింది.
ముంబైకి డబుల్ షాక్!:
పతిరన వేసిన 8వ ఓవర్ తొలి బంతికి ఇషాన్ కిషన్ (23) ఔటవ్వగా... మూడో బంతికి సూర్య కుమార్ ఔటయ్యాడు. దీంతో 8 ఓవర్లకు ముంబయి స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 75కు చేరింది.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ!:
రవీంద్ర జడేజా వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టడంతో హాఫ్ సెంచరీ పూర్తయ్యింది. దీంతో 9 ఓవర్లకు ముంబయి స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులకు చేరింది.
ముంబయి మూడో వికెట్ డౌన్!:
ముంబయి 130 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఇందులో భాగంగా... పతిరన వేసిన 14 ఓవర్లో ఐదో బంతికి తిలక్ వర్మ (31; 20 బంతుల్లో) ఔటయ్యాడు. దీంతో 14 ఓవర్లకు ముంబై స్కోరు 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
ముంబయి నాలుగో వికెట్ డౌన్!:
తుషార్ దేశ్ పాండే వేసిన 15.3 ఓవర్ లో హార్దిక్ పాండ్య (2) ఔటయ్యాడు. దీంతో 16 ఓవర్లకు ముంబై స్కోరు 4 వికెట్లకు 135 పరుగులకు చేరింది.
వరుసగా రెండు సిక్స్ లు - రెండు వికెట్లు!:
ముస్తాఫిజుర్ వేసిన 17 ఓవర్ లో తొలి రెండు బంతులకు రెండు సిక్స్ లు బాదిన టిమ్ డేవిడ్.. తర్వాత బంతికే ఔటయ్యాడు. అనంతరం పతిరన వేసిన 18వ ఓవర్ లో రొమారియో షెఫర్డ్ (1) ఔటయ్యాడు. దీంతో 18 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై స్కోరు 6 వికెట్ల నష్టానికి 160 పరుగులకు చేరింది.
ముంబై విజయానికి చివరి 12 బంతుల్లో 47 పరుగులు!:
చివరి రెండు ఓవర్లలోనూ విజయానికి ముంబైకి 47 పరుగులు కావాలి. ఈ సమయంలో ముస్తాఫిజుర్ వేసిన 19 ఓవర్ లో 13 పరుగులు వచ్చాయి. దీంతో... ముంబయి విజయానికి చివరి ఓవర్ లో 34 పరుగులు అవసరం ఏర్పడింది.
ఈ క్రమంలో చివరి ఓవర్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఈ ఓవర్ లో 13 పరుగులు వచ్చాయి. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. రోహిత్ శర్మ (105*: 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్ లు) సెంచరీ బాదినా జట్టును గెలిపించలేకపోయాడు