డెవిడ్ వార్నర్ కి అవమానం... సన్ రైజర్స్ పై ఫ్యాన్స్ ఫైర్!

దుబాయ్ వేదికగా ఐపీఎల్ - 2024 వేలం మొదలవ్వడంతో ఆ క్రికెట్ సందడి మొదలైపోయింది

Update: 2023-12-19 14:54 GMT

దుబాయ్ వేదికగా ఐపీఎల్ - 2024 వేలం మొదలవ్వడంతో ఆ క్రికెట్ సందడి మొదలైపోయింది. తాజాగా మొదలైన మినీ వేలంలో కీలక ఆటగాళ్లకోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. ఈ సమయంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం దూకుడు కనబర్చింది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా డెవిడ్ వార్నర్ విషయంలో అనుసరించిన వైఖరిపై మాత్రం నెట్టింట విమర్శలను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ ఇష్యూ నెట్టింట వైరల్ గా మారింది.

అవును... ఐపీఎల్ వేలం ప్రారంభమవ్వడంతో మరోసారి భారత్ లో మినీ క్రికెట్ సందడి భారీ ఎత్తున మొదలైపోయింది! ఇందులో భాగంగా... దూకుడు కనబర్చిన సన్ రైజర్స్ జట్టు... .వన్డే వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ ను రూ.20.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇతడి కోసం ఆర్సీబీ తో పోటీ పడి భారీ ధరకు కమిన్స్‌ ను సొంతం చేసుకుంది.

ఈ సమయంలో కమిన్స్ కంటే ముందు ట్రావిస్ హెడ్‌ ను రూ.6.8 కోట్లకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో ట్రావిస్ హెడ్ పెర్ఫార్మెన్స్ తెలిసిందే. మరోపక్క శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగను రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. ఇదే సమయంలో... భారత బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌ ను రూ. 1.6 కోట్లకు తీసుకుంది. ఆ సంగతి అలా ఉంటే.. ఈ సందర్భంగా డెవిడ్ వార్నర్ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ తనను దక్కించుకున్న అనంతరం ఆసిస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సంతోషంతో మాట్లాడిన వీడియోను ఆరెంజ్ ప్రాంఛైజీ ఇన్‌ స్టాగ్రాం వేదికగా పోస్టు చేసింది. దీంతో తన సహచరుణ్ని అభినందిద్దామని అనుకున్నాడో.. లేక, సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ కు కంగ్రాట్స్ చెబుదామనుకున్నాడో తెలియదు కానీ... వార్నర్ మాత్రం ఆ పొస్ట్ కు రిప్లయ్ ఇవ్వలేకపోయాడు. కారణం... సన్‌ రైజర్స్ అతణ్ని బ్లాక్ చేయడమే!

దీంతో తన ఆవేదనను ఆన్ లైన్ వేదికగా పంచుకున్నాడు వార్నర్. ఇందులో భాగంగా... "ట్రావిస్ హెడ్ పోస్టును రీపోస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నా కానీ.. సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఇన్‌ స్టాగ్రాంలో నన్ను బ్లాక్ చేసింది" అని వెల్లడించాడు. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీంతో... దీంతో నెటిజన్లు, వార్నర్ అభిమానులు సన్‌ రైజర్స్‌ పై మండిపడుతున్నారు.

ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి హెచ్చరికలు పంపుతున్నారు. సన్ రైజర్స్ ని గతంలో ఛాంపియన్ గా నిలిపిన ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ముందుగా వార్నర్‌ ను అన్‌ బ్లాక్ చేయమని సూచిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ హితవు పలుకుతున్నారు. దీంతో ఈ ఇష్యూ నెట్టింట వైరల్ గా మారింది.

కాగా... డెక్కన్ ఛార్జర్స్ పేరిట 2008లో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అనంతరం సన్ టీవీ యాజమాన్యం 2012లో దాన్ని దక్కించుకొని "సన్‌ రైజర్స్ హైదరాబాద్‌"గా పేరు మార్చింది. ఈ క్రమంలో 2013లో ప్లేఆఫ్స్ చేరిన ఆ జట్టు.. 2016లో ఛాంపియన్స్‌ గా నిలిచింది. ఆ సమయంలో డెవిడ్ వార్నర్ ముందుండి జట్టును విజేతగా నిలిపాడు.

అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సన్‌ రైజర్స్ వార్నర్‌ ను జట్టులో నుంచి తప్పించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 2022లో వార్నర్ ను దక్కించుకుంది. అయినప్పటికీ సన్‌ రైజర్స్ ఫ్యాన్స్‌ లో వార్నర్ పట్ల అభిమానం తగ్గలేదు. ఈ సమయంలో సన్ రైజర్స్ వార్నర్ ని బ్లాక్ చేయడంతో వారంతా ఆన్ లైన్ వేదికగా ఫైరవుతున్నారు.

Tags:    

Similar News