భార్య స్వర్ణం సాధించింది... సంబరాల్లో దినేశ్ కార్తీక్!

తన భార్య ఏషియన్ గేమ్స్‌ లో స్వర్ణం సాధించడం పట్ల దినేశ్ కార్తీక్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆసియా క్రీడల కోసం చైనా వెళ్లిన భారత క్రికెట్ ఆల్‌ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Update: 2023-10-05 11:16 GMT

ప్రస్తుతం క్రీడా సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఇప్పటికే ఆసియా గేమ్స్‌ జరుగుతుంటే.. మరో పక్క క్రికెట్ వరల్డ్ కప్ స్టార్టయ్యింది. దీంతో ఆటల సంబరాలు హల్ చల్ చే స్తున్నాయి. ఈ సమయంలో ఆసియా గేమ్స్‌ లో భారత్‌ కు మరో స్వర్ణం లభించింది. ఈ పథకం సాధించిన జోడీలో ఒకరు వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ భార్య కావడం గమనార్హం.

అవును... ఏషియన్ గేమ్స్‌ లో స్క్వాష్‌ విభాగంలో భారత మిక్స్‌డ్ డబుల్స్ ద్వయం దీపికా పల్లికల్‌ - హరిందర్‌ సంధు జోడీ బంగారు పథకం సాధించింది. మలేషియాకు చెందిన ఐఫా బింటి అజ్మాన్ – సయాఫిక్ కమల్‌ ల జోడీని 11-10, 11-10 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించారు దినేష్ కార్తీక్!

తన భార్య ఏషియన్ గేమ్స్‌ లో స్వర్ణం సాధించడం పట్ల దినేశ్ కార్తీక్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆసియా క్రీడల కోసం చైనా వెళ్లిన భారత క్రికెట్ ఆల్‌ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇందులో భాగంగా... దీపిక స్వర్ణం గెలిచిన వీడియోను కార్తీక్‌ కు పంపించాడు. వాషింగ్టన్ సుందర్‌ తోపాటు రాహుల్ త్రిపాఠి.. దీపిక ఆటను ప్రత్యక్షంగా తిలకించారు.

కాగా... దినేశ్ కార్తీక్ మొదటి భార్య అతడి స్నేహితుడైన మురళీ విజయ్‌ ను పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కార్తీక్ తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఆటపై శ్రద్ధ పెట్టలేకపోవడంతో భారత జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఈ సమయంలో కార్తీక్ జీవితంలోకి స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ వచ్చారు.

అనంతరం దినేశ్ కార్తీక్ ని మళ్లీ మామూలు మనిషిని చేసింది. దీంతో కార్తీక్ తిరిగి జట్టులోకి రాగలిగాడు. ఈ క్రమంలో... 2015లో దీపిక, కార్తీక్ పెళ్లి చేసుకొన్నారు. అనంతరం 2021 అక్టోబర్లో వీరికి కవల పిల్లలు కబీర్, జియాన్ జన్మించారు. ఆ తర్వాత కూడా దీపిక ఆటను కొనసాగించారు. అందులో భాగంగా ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌ లో పసిడి పతకం సాధించారు.

ఇలా స్క్వాష్‌ లో దీపికా పల్లికల్‌ - హరిందర్‌ సంధు జోడీ గోల్డ్ మెడల్ సాధించడంతో భారత్‌ ఖాతాలో 20వ గోల్డ్ మెడల్ చేరింది. దీంతో... భారత్‌ పతకాల సంఖ్య 83కి చేరింది. ఇందులో 20 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత అథ్లెట్లు 100 పతకాలు లక్ష్యంగా 2023 ఆసియా గేమ్స్‌ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News