అంతా దేవుడి దయ... బర్త్ డే ముందు కొహ్లీ కామెంట్స్ వైరల్!
ఆ డేట్! అది టీం ఇండియా కింగ్ విరాట్ కొహ్లీ బర్త్ డే! దీంతో ఈ మ్యాచ్ లో రికార్డ్ స్థాయి విక్టరీ సాధించి విరాట్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని టీం ఇండియా క్రికెటర్లు భావిస్తున్నారు.
వన్ డే ప్రపంచ కప్ లో భారత్ తన దూకుడు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆడిన ఫస్ట్ మ్యాచ్ నుంచి వరుసగా ఆరు విక్టరీలు సాధించిన టీం ఇండియా.. ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఓటమి ఎరుగని ప్రయాణం చేస్తుంది. ఆడిన ఆరు మ్యచ్ లలోనూ గెలవడంతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లలో ఉంది. ఈ క్రమంలో ముంబైలోని వాఖండే స్టేడియంలో తమ తదుపరి మ్యాచ్ లో శ్రీలంక జట్టుతో ఆడుతుంది. తర్వాత మ్యాచ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అది ఒక స్పెషల్ డే!
అవును... ఈ రోజు శ్రీలంకతో మ్యాచ్ అనంతరం భారత్ కు లీగ్ లో నెక్స్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అది నవంబర్ 5న ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. ఈమ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం... ఆ డేట్! అది టీం ఇండియా కింగ్ విరాట్ కొహ్లీ బర్త్ డే! దీంతో ఈ మ్యాచ్ లో రికార్డ్ స్థాయి విక్టరీ సాధించి విరాట్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని టీం ఇండియా క్రికెటర్లు భావిస్తున్నారు. అనంతరం భారీ పార్టీ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారంట!
ఈ సమయంలో అంతకు ముందు కింగ్ కోహ్లీ తన కెరీర్ గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా చాలా ఓపెన్ గా మాట్లాడిన కొహ్లీ.. తన కెరీర్ ఎక్కడ మొదలైంది, ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది, ఈ క్రమంలో జరిగిన విషయాలు, తాను కన్న కలలు మొదలైన విషయాలు పంచుకున్నాడు. ఇందులో భాగంగా... "భగవంతుని దయ వల్ల నేను ఇలా ఉన్నాను" అని చెప్పడం గమనార్హం.
ఈ సందర్భంగా స్పందించిన కొహ్లీ... తన క్రికెట్ జీవితంలో ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని అన్నాడు. ఇదంతా భగవంతుని దయ అని.. ఆ దేవుడి దయవల్లే తాను ఇలా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో తన పనితీరు, స్థిరత్వం ఇలానే కొనసాగుతుందని నమ్మకంగా చెబుతున్నాడూ కొహ్లీ. సెంచరీలు సాధించి, వేల పరుగులు సాధించాలని కలలుగన్నట్లయితే.. దాన్ని సాధిస్తారని బలంగా చెబుతున్నాడు.
ఇక తన 12 ఏళ్ల కెరీర్ లో ఇన్ని పరుగులు చేసినందుకు సంతోషంగా ఉందని చెబుతున్న కొహ్లీ... తానేమీ ప్లాన్ చేయలేదని, అలా జరిగిపోతుందని అంటున్నాడు. ఒకానొక సమయంలో ప్రొఫెషనల్ క్రికెట్ లో తనలోని లోపాలను స్వీయ విశ్లేషణ చేసుకున్నట్లు చెబుతూ... టీం ఇండియా విజయంకోసం ధీటుగా రాణించి, కష్ట సమయాల్లో కూడా జట్టును ఆదుకోవడమే తన లక్ష్యమని నొక్కి వక్కానించాడు.
ఇదే సమయంలో ఈ ఫిట్ నెస్, ఈ ఫెర్మార్మెన్స్ కోసం తన లైఫ్ స్టైల్ ని ఎంతగానో మార్చుకుని, మరింత క్రమశిక్షణగా ఉంటున్నట్లు చెబుతూ... మైదానంలో 100% అంకితభావంతో ఆడేందుకు కష్టపడ్డట్లు చెబుతున్నాడు. ఫైనల్ గా... ఇదంతా దేవుడి దీవెనలుగా భావిస్తున్నట్లు కింగ్ కొహ్లీ తెలిపాడు.
కాగా... 2008లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన కింగ్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించాడు. ఈ ప్రపంచకప్ లో కోహ్లి ఇప్పటికే ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలతో సహా 354 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్ లో తన 48వ సెంచరీని సాధించడం ద్వారా భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49) వన్డే సెంచరీల రికార్డును సమం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
మరి ఈ నెల 5వ తేదీన ఈడెన్ గార్డెన్స్ లో కోహ్లీ పుట్టినరోజు వేడుకలు ఏ రేంజ్ లో జరగబోతున్నాయనేది వేచి చూడాలి. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ బోర్డు (క్యాబ్ ) ఈ మెరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. సుమారు 70 వేల మంది ప్రేక్షకులకు కోహ్లీ మాస్క్ లు ఇవ్వనున్నట్లు సమాచారం.