గంభీర్ తో జతిన్ సప్రూ సరదా... వీడియో వైరల్!
ఈ సమయంలో స్టార్క్ ను సొంతం చేసుకున్న కోల్ కతా నైట్ రైండర్స్ మెంటర్ గంభీర్ కు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.
ఇటీవల దుబాయ్ లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో రికార్డ్ స్థాయిలో సరికొత్త ధరలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆసిస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, కమిన్స్ కి 20కోట్ల రూపాయలు పైగా ధర పలకడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో స్టార్క్ ను సొంతం చేసుకున్న కోల్ కతా నైట్ రైండర్స్ మెంటర్ గంభీర్ కు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.
అవును... ఐపీఎల్ లో ఇప్పటికి రెండు సార్లు విజేతగా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్... ముచ్చటగా మూడోసారి కప్పును ముద్దాడాలని బలంగా ఫిక్సయినట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే అనుకున్న ఆటగాళ్లను దక్కించుకునే విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు పోటుంది. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన ఐ.పీ.ఎల్ - 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం గట్టిగా పోటీపడింది.
ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం రూ.24.75 కోట్లు వెచ్చించి మరీ అతడిని సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో స్టార్క్ పెర్ఫార్మెన్స్ ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఇదే సమయంలో స్లాగ్ ఓవర్స్ లో పొదుపుగా బౌలింగ్ చేస్తాడనే పేరుంది. దీంతో.. ఐపీఎల్ 2024 కోసం కోల్ కతా నైట్ రైడర్స్ అతడికోసం అధిక మొత్తం వెచ్చించింది.
స్టార్క్ కోసం ఈ స్థాయిలో వెచ్చిచడం వెనుక ఆ జట్టుకు మెంటర్ గా ఉన్న గంభీర్ పాత్ర కూడా కీలకం అని అంటున్నారు. ఈ సమయంలో స్టార్క్ కోసం అన్ని కోట్లు వెచ్చించడంపై గౌతం గంభీర్ ను ప్రజెంటర్ జతిన్ సప్రూ ఓ ఇంటర్వ్యూలో అడిగారు. అనంతరం తనకూ ఓ రెండు లేదా మూడు కోట్లు ఇప్పించండంటూ చేతులు జోడించి సరదాగా అడిగాడు.
దీంతో గౌతం గంభీర్ పగలబడి నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సుమారు 15 సెకన్లు గల ఈ వీడియో పై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
కాగా... రూ.2కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ కోసం... ముందుగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడగా.. అనంతరం కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ లు పోటీలోకి వచ్చాయి. ఈ సమయంలో కోల్ కతా నైట్ రైండర్స్, గుజరాత్ లు స్టార్క్ విషయంలో ఎక్కడా తగ్గకపోవడంతో అతడి ధర రూ.20 కోట్లు దాటింది.
అయినప్పటికీ పట్టువదలని కోల్ కతా చివరకు స్టార్క్ ను రూ.24.75 కోట్లకు సొంతం చేసుకుంది. కోల్ కతా ఈ స్థాయిలో స్టార్క్ కోసం పోటీపడటం వెనుక కేకేఆర్ మాజీ కెప్టెన్ గంభీర్ పాత్ర బలంగా ఉందని అంటున్న సమయంలో... జతిన్ సప్రూ ఇలా సరదగా పెర్ఫార్మ్ చేశాడు.