జోస్ ఈస్ బాస్... ఆ జాబితాలో రెండో ప్లేస్ కి బట్లర్!

కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ భారీ విజయం సాధించింది. కోల్‌ కతాను తన సొంతగడ్డపైనే 2 వికెట్ల తేడాతో ఓడించింది

Update: 2024-04-17 07:36 GMT

కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ భారీ విజయం సాధించింది. కోల్‌ కతాను తన సొంతగడ్డపైనే 2 వికెట్ల తేడాతో ఓడించింది. రాజస్తాన్‌ విజయలక్ష్యం 224 కాగా... 14 ఓవర్ల తర్వాత 6 వికెట్లు కోల్పోయి 128 చేసింది. అంటే... చివరి 6 ఓవర్లలో 96 పరుగులు కావాలి! దీంతో... రాజస్థాన్ విజయం దాదాపు అసాధ్యంగానే కనిపించింది. అయినా విజయం సాధించింది. ఈ గ్రాండ్ విక్టరీకి కారకుడైన ఒకేఒక్కడు జోస్ బట్లర్. ప్రస్తుతం.. అతడి వీరోచిత పోరాటం వైరల్ గా మారింది.

అవును... కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ గెలవాలంటే 36 బంతుల్లో 96 పరుగులు కావాలి. ఆ దశలో జోస్ బట్లర్‌ 42 పరుగుల వద్ద ఉన్నాడు. ఈ సమయంలో బట్లర్‌ బ్యాటింగ్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. చివరి ఆరు ఓవర్లలో వరుసగా 17, 17, 16, 18, 19, 9 పరుగుల చొప్పున రాబట్టి రాజస్థాన్ రాయల్స్‌ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు!

ఓపెనర్‌ గా బరిలోకి దిగిన జోస్‌ బట్లర్‌ (107*: 60 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌ లు) కడదాకా ఉండి సెంచరీతో తన జట్టును గెలిపించాడు. దీంతో... బట్లర్ పేరుమీద సరికొత్త రికార్డ్ క్రియేట్ అయ్యింది. ఇందులో భాగంగా... ఛేజింగ్ లో మూడు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఇదే క్రమంలో ఐపీఎల్ లో అత్యధిక సెంచరీల రికార్డ్ కొహ్లీ (8) పేరున ఉండగా... ఇప్పుడు రెండో ప్లేస్ లో 7 సెంచరీలతో బట్లర్ నిలిచాడు.

ఈ జాబితాలో ఇప్పటివరకూ రెండో ప్లేస్ లో ఉన్న క్రిస్ గేల్ (6) ను వెనక్కి నెట్టాడు బట్లర్. ఈ సమయంలో కాలి గాయంతో కూడా అలుపెరగని పోరాటం చేసి జట్టును గెలిపించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో... ఈ సీజన్ లో ఆడిన 7 మ్యాచ్ లలో ఆరింట గెలిచిన రాజస్థాన్ 12 పాయింట్లతో టాప్ ప్లేస్ లోనే కొనసాగుతుంది.

ఐపీఎల్ టాప్ 10 హైయెస్ట్ సెంచరీ జాబితా!:

విరాట్ కొహ్లీ - 8

జోస్ బట్లర్ - 7

క్రిస్ గేల్ - 6

రాహుల్ - 4

డేవిడ్ వార్నర్ - 4

షేన్ వాట్సన్ - 4

ఏబీ డివిలియర్స్ - 3

శుభ్ మన్ గిల్ - 3

సంజూ శాంసన్ - 3

హాషిం ఆమ్లా- 2

Tags:    

Similar News