కలిస్ ను వెనక్కు పంపిన కొహ్లీ... నెక్స్ట్ ఎవరు?
ఈ క్రమంలో కోహ్లి సౌతాఫ్రికా లెజెండ్ జాక్ కలిస్ (211) రికార్డును అధిగమించాడు.
ఈ ప్రపంచ కప్ లో టీం ఇండియా వరుస విజయాలు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. వితౌట్ గ్యాప్ ఛేజింగ్ లతో దుమ్ము లేపుతోంది. ఈ క్రమలో వరుసగా నాలుగు విక్టరీలు సాధించింది. ఈ సమయంలో బంగ్లాతో మ్యాచ్ లో విరాట్ కొహ్లీ కొట్టిన ఒక సెంచరీ... ఎన్నో రికార్డులను చెరుపుతూ, మరికొన్ని రికార్డుల తరుముతూ, ఇంకొన్ని రికార్డులకు చేరువగా తీసుకెళ్లింది. ఆ రికార్డుల లిస్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్... నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ కి దిగిన భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇండియన్ బ్యాట్ మెన్స్ లో విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్: 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగాడు.
ఇలా తన వరల్డ్ కప్ కెరీర్ లో చేజింగ్ లో ఫస్ట్ సెంచరీ సాధించిన కొహ్లీ మరో ఆల్ టైం రికార్డుకు చేరువవుతున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన అతను.. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు (212) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో కోహ్లి సౌతాఫ్రికా లెజెండ్ జాక్ కలిస్ (211) రికార్డును అధిగమించాడు.
అవును... ఇంటర్నేషనల్ క్రికెట్ లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు కలీస్ 211 సార్లు చేయగా... తాజాగా కొహ్లీ 212 సార్లు చేశాడు. ఈ జాబితాలో ఫోర్ట్ ప్లేస్ కి చేరుకున్నాడు. ఇక ఈ లిస్ట్ టాప్ 3 లో ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (264) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (217), శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (216) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
అంటే... 50 ప్లస్ స్కోర్ లు మరో ఐదు చేస్తే మూడో ప్లేస్ కి, ఆరు చేస్తే సెకండ్ ప్లేస్ కి చేరుకుంటాడు కొహ్లీ. ఇదే సమయంలో మరొ 53 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేస్తే సచిన్ ఆల్ టైం రికార్డును అధిగమిస్తాడు.
ఇదే సమయంలో ఈ మ్యాచ్ లో సెంచరీతో కోహ్లి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో భాగంగా... వన్డేల్లో 48వ సెంచరీని, ఓవరాల్ గా (అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో) 78వ సెంచరీని కొహ్లీ నమోదు చేసుకున్నాడు. ఇదే సమయంలో ఈ 103 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్ లో 26000 పరుగుల మైలురాయిని (26026 పరుగులు) దాటాడు.
ఈ జాబితాలో కూడా కొహ్లీ టాప్ 4లో నిలిచాడు. ఈ లిస్ట్ లో సచిన్ (34,357), కుమార సంగక్కర (28,016), పాంటింగ్ (27,483) లు టాప్ 3 లో ఉన్నారు. నిన్నటివరకూ ఈ లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో మహేలా జయవర్ధనే (25957) ఉండగా... తాజాగా కొహ్లీ ఇతడిని దాడి నాలుగో స్థానానికి ఎగబాకాడు.