5 నిమిషాల్లోపే ‘‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’’.. ప్రపంచ కప్ లో ఫాస్ట్.. ‘‘తుపాకీ’’ స్పెషల్

. అయితే, దీనికి కొంత సమయం పడుతుంది. ఆటగాళ్లు డ్రస్సింగ్ రూమ్ కు చేరుకుని.. అక్కడినుంచి కాస్త సేదదీరి మళ్లీ గ్రౌండ్ కు వచ్చి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పంపిణీలో పాల్గొంటారు.

Update: 2023-10-13 15:30 GMT

భారత్ ఏకైక వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ అనేక కొత్త రికార్డులకు వేదికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సెంచరీల మోత మోగుతోంది. ఒక్కో మ్యాచ్ లో రెండేసి శతకాలు నమోదవుతున్నాయి. ప్రపంచ కప్ లో అత్యధిక శతకాల (7) రికార్డును భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా అత్యధిక స్కోరు (428)ను నమోదు చేసింది. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రపంచ కప్ ముగిసేనాటికి మరెన్ని రికార్డులు కొత్తగా చేరుతాయో చూడాలి. అయితే, ఈ కప్ లో ఎవరూ గుర్తించని మరో విశేష అంశం ‘‘తుపాకీ’’ పరిశీలనలో బయటకు వచ్చింది.

మ్యాచ్ అలా కాగానే ఇలా పంపిణీ

మ్యాచ్ లు పూర్తయ్యాక సహజంగానే ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తుంటారు. అయితే, దీనికి కొంత సమయం పడుతుంది. ఆటగాళ్లు డ్రస్సింగ్ రూమ్ కు చేరుకుని.. అక్కడినుంచి కాస్త సేదదీరి మళ్లీ గ్రౌండ్ కు వచ్చి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పంపిణీలో పాల్గొంటారు. ఈ తతంగం అంతా పూర్తికావడానికి కనీసం పదిహేను నుంచి 20 నిమిషాలైనా పడుతుంది. కానీ, ఈ ప్రపంచ కప్ లో మాత్రం అలా కాదు.

ఐదు నిమిషాల్లోనే ప్రకటన

ప్రపంచ కప్ లో ప్రస్తుతం మ్యాచ్ ఇలా పూర్తయిందో లేదో ఐదు నిమిషాల్లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పంపిణీ జరిగిపోతోంది. ఎంతైనా ఇది ప్రత్యేకమే అని చెప్పాలి. ఉదాహరణకు భారత్ తన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కేఎల్ రాహుల్ (97) కేవలం 5 నిమిషాల్లోపే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నిన్నటి దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ లోనూ.. డికాక్ (109) ఇంతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను ప్రదానం చేశారు.

ఇదీ అసలు కారణం..

భారత్ ఏకైక వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో మ్యాచ్ లన్నీ మధ్యాహ్నం నుంచి మొదలవుతున్నాయి. అంటే.. 1.30 నుంచి లేదా 2 గంటల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వన్డే కాబట్టి పూర్తయ్యేసరికి రాత్రి 10అవుతోంది. అప్పటికే సుదీర్ఘ సమయం అయిపోతోంది. మూడున్నర గంటల్లో ముగిసే టి20లు వచ్చాక వన్డేలు పెద్ద వ్యవధి తీసుకునే ఫార్మాట్ గా కనిపిస్తున్నాయి. ఇక ప్రపంచ కప్ లో మ్యాచ్ నిర్ణీణ సమయానికి పూర్తయినా పదిన్నర అవుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకునే మ్యాచ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాడికి కాస్త ముందుగానే అవార్డు నిర్ణయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మ్యాచ్ ముగిసీ ముగియగానే దానిని ప్రకటన చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Tags:    

Similar News