ఆనంద్ కు గుకేశ్ ఎఫెక్ట్... 37ఏళ్ల రికార్డ్ 17ఏళ్ల కుర్రాడి వల్ల ఫినిష్!

యువ గ్రాండ్‌ మాస్టర్‌ గుకేశ్‌ సరికొత్త రికార్డ్ సృష్టించాడు

Update: 2023-09-03 05:14 GMT

ఇండియాలో చెస్ పేరు చెప్పగానే వినిపించే పేరు విశ్వనాథన్ ఆనంద్. చెస్ లో భారత్ పేరు మార్మోగిపోయేలా చేసిన ఘనత ఈ గ్రాండ్ మాస్టర్ కే దక్కుతుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో తాజాగా యువ గ్రాండ్‌ మాస్టర్‌ డి గుకేశ్‌... విశ్వనాథన్ ఆనంద్ రికార్డును అధిగమించాడు. ఫలితంగా సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

అవును... యువ గ్రాండ్‌ మాస్టర్‌ గుకేశ్‌ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తాజాగా ఫిడే ప్రకటించిన ర్యాంకింగ్స్‌ లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. దీంతో... మూడున్నర దశాబధాలకు పైగా భారత్‌ తరఫున టాప్‌ ర్యాంకర్‌ గా కొనసాగుతున్న విశ్వనాథన్‌ ఆనంద్‌ రికార్డును అధిగమించాడు. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చెస్ ప్రపంచంలో మనోడి పేరు మారుమ్రోగిపోతుంది!

తాజాగా ప్రకటించిన ఫిడే పాయింట్స్ & ర్యాకింగ్స్ పట్టికలో గుకేశ్‌ 2,758 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. విశ్వనాథన్‌ ఆనంద్ 2,754 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో ఇండియా తరఫున టాప్‌ ప్లేయర్‌ గా గుకేశ్‌ అవతరించాడు. గత ఆగస్ట్ 1 సమయానికి 11 స్థానలో ఉన్న గుకేశ్ ఈ ఏడాది లోపే మూడు స్థానాలను మెరుగుపర్చుకోవడం విశేషం.

ఇక, ఇటీవలే చెస్ ప్రపంచ కప్‌ ను నెగ్గిన కార్ల్‌ సన్‌ 2,839 ఫిడే పాయింట్లతో ఈ జాబితాలో టాపర్ గా నిలిచాడు. ఇదే క్రమంలో గుకేశ్‌, విశ్వనాథ్హన్ ఆనంద్‌ తర్వాత భారత మూడో టాప్‌ ప్లేయర్‌ గా ప్రజ్ఞానంద అవతరించాడు. చెస్‌ ప్రపంచకప్‌ 2023 ఫైనలిస్ట్‌ అయిన ప్రజ్ఞానంద... 2,727 పాయింట్లతో 19వ స్థానానికి చేరాడు.

వీరితోపాటు సీనియర్‌ చెస్‌ ప్లేయర్ పెండ్యాల హరికృష్ణ 31 ర్యాంకులో నిలవగా... మహిళల జాబితాలో భారత చెస్ ప్లేయర్ కోనేరు హంపి 2,550 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Tags:    

Similar News