వన్డే ప్రపంచ కప్పా..? గల్లీ కప్పా..? 9మ్యాచ్ ల రీషెడ్యూల్

సహజంగా ప్రపంచ కప్ అంటే అందులోనూ వన్డే ప్రపంచ కప్ అంటే ఏడాది ముంగిట మైదానాల ఎంపికతో పాటు మ్యాచ్ ల షెడ్యూల్ ను ఏడాది ముంగిటే ప్రకటిస్తారు.

Update: 2023-08-09 13:44 GMT

సహజంగా ప్రపంచ కప్ అంటే అందులోనూ వన్డే ప్రపంచ కప్ అంటే ఏడాది ముంగిట మైదానాల ఎంపికతో పాటు మ్యాచ్ ల షెడ్యూల్ ను ఏడాది ముంగిటే ప్రకటిస్తారు. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, 2019 ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచ కప్ లలో ఇలానే చేశారు. కానీ, ఈ సారి భారత్ ఆతిథ్యం ఇవ్వబోయే ప్రపంచ కప్ కేవలం 100 రోజుల ముందుగా షెడ్యూల్ ప్రకటించారు. 2019 తర్వాత కొవిడ్ ప్రభావం చూపిందనుకున్నా.. కనీసం ఆరు నెలల ముందైనా షెడ్యూల్ ఇవ్వాలి. అయితే, 3 నెలల ముందుగా మాత్రమే ప్రకటించగలిగారు. అందులోనూ ఇప్పుడు ఏకంగా 9 మ్యాచ్ ల షెడ్యూల్ ను మర్చారు. ఒకటీ అరా అంటే సర్దిచెప్పుకోవచ్చు. 9 మ్యాచ్ ల తేదీలను మార్చడం అంటే ఎక్కడో తేడా కొడుతోంది.

2011 తర్వాత భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరుగుతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలా ఎవరితోనూ పొత్తు లేకుండా మొత్తం మన దేశమే నిర్వహిస్తోంది. అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా షెడ్యూల్ ప్రకటించాలి. కానీ, బీసీసీఐ కార్యదర్శి జై షా ఆధ్వర్యంలోని బోర్డు ఈ విషయంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. అక్టోబరు 5న కప్ ప్రారంభం కానుండగా.. సరిగ్గా రెండు నెలల సమయం కూడా లేని సమయంలో 9 మ్యాచ్ లను రీ షెడ్యూల్ చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకున్నారు.

వాస్తవానికి భారత్ –పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబరు 15న గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అదే రోజున దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. నిఘా సంస్థలు కూడా మ్యాచ్ జరిగే తేదీని మార్చాలని బీసీసీఐకి సూచించాయి. దీంతో భద్రతా కారణాల రీత్యా ఒక రోజు ముందు (అక్టోబరు 14న)కు మార్చారు. కాగా, దాదాపు నెల కిందట వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ఖరారైంది. నవంబరు 12న కోల్‌ కతాలో పాకిస్థాన్- ఇంగ్లాండ్ మధ్య ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇదే రోజున కాళీమాత పూజ ఉంది. అసలే కోల్ కతా. అందులోనూ కాళీ మాత పూజ. దీనికి భారీగా పోలీసులు బలగాలు అవసరం. అందుకని భద్రతా ఏజెన్సీలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. పాక్ – ఇంగ్లండ్ మ్యాచ్‌ను వేరే తేదీకి మార్చాలని బెంగాల్ క్రికెట్‌ సంధం ఐసీసీ రెక్కీ టీంను అభ్యర్థించినట్లు సమాచారం.

మూడు అనుకుంటే తొమ్మిది...

కోల్ కతాలో పాక్-ఇంగ్లండ్ మ్యాచ్, హైదరాబాద్‌ లో అక్టోబరు 10న పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌ ను 12కు జరిపారు. కాగా, జూన్‌ 27న కప్‌ షెడ్యూల్ విడుదలైంది. ఇలా వరుసగా మార్పులు చేస్తారా లేక యథావిధిగా షెడ్యూల్‌ కొనసాగిస్తారా అనేది తేలడం లేదు. ఈలోగానే

భారత్‌, పాక్‌ మ్యాచ్‌ తోపాటు మరో ఎనిమిది మ్యాచ్‌ లను కూడా ఐసీసీ రీ షెడ్యూల్ చేసింది. అక్టోబరు 10న ఇంగ్లాండ్ - బంగ్లాదేశ్‌, అక్టోబరు 10న పాకిస్థాన్‌ - శ్రీలంక, అక్టోబరు 12న ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా, అక్టోబరు 13న ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్, అక్టోబరు 15న ఇంగ్లాండ్ - అఫ్గానిస్థాన్‌, నవంబరు 11న ఆస్ట్రేలియా – బంగ్లాదేశ్ , నవంబరు 11న ఇంగ్లాండ్ - పాకిస్థాన్‌, నవంబర్‌ 12న భారత్ -నెదర్లాండ్స్‌ మ్యాచ్ ల తేదీలనూ రీ షెడ్యూల్ చేసింది. ఏది ఏమైనా ఇలా చేయడం మాత్రం అనూహ్యమే.

Tags:    

Similar News