కోహ్లీ సెంచరీ వెనుక ఇంగ్లిష్ కమల్ హాసన్... కామెంట్స్ వైరల్!

బంగ్లాతో కొహ్లీ సెంచరీ చేయడంలో కేఎల్‌ రాహుల్‌ పాత్ర కీలకం అని అంటున్నారు. రాహుల్ పట్టుబట్టడంతో చివరకు కోహ్లి శతకాన్ని అందుకున్నాడు

Update: 2023-10-20 05:11 GMT

వరల్డ్ కప్ లో భారత్ విజయయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ ఇలా మూడు దేశాలను వరుసగా ఓదించిన టీం ఇండియా తాజాగా బంగ్లాదేశ్‌ పైనా గ్రాండ్ విక్టరీ సాధించింది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయితే తాజాగా బాంగ్లాతో జరిగిన మ్యాచ్‌ లో కోహ్లీ సాధించిన సెంచరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. కారణం... అది సాధిస్తానని కోహ్లి కూడా ఊహించకపోవడమే!

బంగ్లాతో కొహ్లీ సెంచరీ చేయడంలో కేఎల్‌ రాహుల్‌ పాత్ర కీలకం అని అంటున్నారు. రాహుల్ పట్టుబట్టడంతో చివరకు కోహ్లి శతకాన్ని అందుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాచ్‌ అనంతరం స్వయంగా రాహుల్‌ వెల్లడించాడు. "కోహ్లి సింగిల్‌ తీసేందుకు ప్రయత్నిస్తే వద్దని చెప్పా. కానీ సింగిల్స్‌ తీయకుంటే బాగుండద.. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు భావిస్తారని చెప్పాడు. కానీ మనం ఎలాగో గెలుస్తామని, అలాంటప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పులేదని కోహ్లీకి చెప్పాను" అని రాహుల్ అన్నాడు.

విరాట్ కోహ్లి 74 పరుగులతో ఉన్నప్పుడు.. జట్టు విజయానికి ఇంకా 27 పరుగులు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్‌ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. కోహ్లీకి సెంచరీ సాధించే అవకాశమిచ్చాడు. సింగిల్స్‌ కోసం కోహ్లి ప్రయత్నించినప్పటికీ రాహుల్‌ వెళ్లలేదు. 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 97తో ఉన్నాడు. జట్టు విజయానికి రెండు పరుగులే కావాలి. ఈ సమయంలో 42వ ఓవర్లో మూడో బంతికి కొహ్లీ సిక్స్ కొట్టాడు. బ్యాట్ ఎత్తాడు. అయితే... ఇక్కడ మరో వ్యక్తి పాత్ర అత్యంత కీలకం అని అంటున్నారు విశ్లేషకులు!

అవును... వరల్డ్ కప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ పై విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. కానీ ఇలా కోహ్లీ సెంచరీ చేయడానికి అంపైర్ రిచర్డ్ కెటిల్‌ బరో కూడా చాలా హెల్ప్ చేశాడని కొందరు మర్చిపోతున్నారు. మరికొంతమంది ఇది కన్ ఫాం చేస్తున్నారు. ఇదే సమయంలో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అంపైర్ కెటిల్‌ బరోపై జోకులు వేస్తున్నారు. అతని ఫెర్మార్మెన్స్ ని ప్రశంసిస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... కోహ్లీ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా, 42వ ఓవర్ వేయడానికి బంగ్లా బౌలర్ నాసుమ్ అహ్మద్ వచ్చాడు. వచ్చీరావడంతోనే అతను కోహ్లీ లెగ్‌ సైడ్ బంతిని వేశాడు. దీంతో... కోహ్లీ కొంచెం అలా పక్కకు తప్పుకోగానే అది అతని కాళ్ల వెనుక నుంచి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఇలా కావాలనే వైడ్ డెలివరీ వేశాడని భావించిన కోహ్లీ... నాసుమ్ అహ్మద్ వైపు సీరియస్ గా చూస్తూ చికాకు పడిపోయాడు. ఈ సమయంలో అంపైర్ షాకిచ్చాడు.

నాసుమ్ అహ్మద్, బంగ్లాదేశ్ టీం, చివరకు టీమిండియా సభ్యులతోపాటు ప్రేక్షకులను కూడా మరింత ఆశ్చర్యంలో ముంచేశాడు అంపైర్ రిచర్డ్ కెటిల్‌ బరో! కారణం... అతను దాన్ని వైడ్‌ గా ప్రకటించలేదు. కోహ్లీ కూడా ఈ నిర్ణయం చూసి షాకయ్యాడు. ఈ సమయంలో కెటిల్ బరో తనలో ఉన్న నటుణ్ని బయటకు తీశాడు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా గడ్డం గీక్కుంటూ కనిపించాడు. ఆ తర్వాత మూడో బంతికే భారీ సిక్సర్ బాదిన కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నారు.

దీంతో... ఇప్పుడు కెటిల్‌ బరో ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్న ఫ్యాన్స్.. "కోహ్లీ సెంచరీకి కారణం అయిన ఈ అంపైర్ కి మెడల్ ఇవ్వాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గడ్డం గీక్కుంటున్న కెటిల్ బరో ఫొటోను పెట్టి "ఏం యాక్టింగ్ చేస్తున్నావ్ గురూ?" అంటూ జోక్స్ చేస్తున్నారు. మరికొంతమంది... " ఇంగ్లిష్ కమల్ హాసన్..." అంటూ అతనిలోని నటుణ్ని ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా... ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంపైర్ ఫెర్మార్మెన్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News