ఐరెన్ లెగ్ సెంటిమెంట్ నిజమైంది?

టీమిండియా ఓటమికి బ్యాటర్లు రాణించకపోవటం.. బౌలర్లు ఫెయిల్ కావటం లాంటి విశ్లేషణలు కొందరు. పిచ్ చేసిన పాపమే టీమిండయాను బలి చేసిందని కొందరు

Update: 2023-11-20 04:02 GMT

లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా ఎరగని టీమిండియా.. ప్రపంచకప్ టోర్నీలో చివరి మ్యాచ్ లో బొక్క బోర్లా పడటం కోట్లాది మంది భారతీయులకు వేదనకు గురి చేస్తోంది. టీమిండియా ఓటమికి బ్యాటర్లు రాణించకపోవటం.. బౌలర్లు ఫెయిల్ కావటం లాంటి విశ్లేషణలు కొందరు. పిచ్ చేసిన పాపమే టీమిండయాను బలి చేసిందని కొందరు. ఇదేమీ కాదు.. ఐరెన్ లెగ్ సెంటిమెంట్ వర్కువుట్ కావటం వల్లే.. ఈ దారుణ ఓటమి ఎదురైందన్న వాదనను వినిపిస్తున్నారు.

ఫైనల్ పోరుకు రెండు.. మూడు రోజుల ముందు నుంచి ఒక సెంటిమెంట్ మాట వైరల్ గా మారింది. ప్రపంచకప్ ఫైనల్ పోరుకు అంపైర్ల ప్యానల్ ను ప్రకటించినంతనే.. భారత ఓటమి గురించి ప్రస్తావిస్తూ కొందరు వ్యాఖ్యలు చేయటం చేశారు. మరికొన్ని మీడియాల్లోనూ అంపైర్ సెంటిమెంట్ కు సంబంధించిన కథనాలు జోరందుకున్నాయి. ఇంతకూ సదరు ఐరెన్ లెగ్ అంపైర్ సెంటిమెంట్ ఏమిటి? ఇంతకూ ఆయన ఎవరన్న విషయంలోకి వెళితే..

ఫైనల్ మ్యాచ్ కు ఐసీసీ ప్రకటించిన అంపైర్ల జాబితాలో నలుగురు పేర్లు ఉండగా.. వారిలో రిచర్డ్ కెటిల్ బరో విషయంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన టీమిండియా పాలిట ఐరెన్ లెగ్ అని పేర్కొన్నారు. ఆయన అంపైరింగ్ చేసిన ఏ మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించదని.. ఆ సెంటిమెంట్ ఏ ఒక్క మ్యాచో.. రెండు మ్యాచుల్లో కాదు పలు సందర్భాల్లోనూ చోటు చేసుకుందన్న మాట వినిపించింది.

తమ వాదనకు తగ్గట్లే.. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ మ్యాచ్ లోనూ ఆయన అంపైర్ అంటే.. ఆ కీలక మ్యచ్ లో టీమిండియా ఓడిపోవటం ఖాయమని చెబుతారు. అందుకు తగ్గట్లే తాజాగా ఫైనల్ పోరులోనూ భారత్ జట్టు బొక్క బోర్లా పడటం చూసిన వారంతా.. సదరు ఐరెన్ లెగ్ అంపైర్ కు దండం పెట్టేస్తున్నారు. చూస్తూ.. చూస్తూ సదరు బండ ఎంపైర్ మీద ఏదైతే సెంటిమెంట్ అనుకున్నారో.. అది అక్షరాల నిజమైందని.. టీమిండియా పాలిట ఐరెన్ లెగ్ అయ్యారన్న ఆక్రోశం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. నిజమే.. ఎంత పని చేశామయ్యా కెటిల్ బరో.

Tags:    

Similar News