.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

టీ20 క్రికెట్ మ్యాచ్ లపై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన!

37 ఏళ్ల రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన రోజునే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన రిటైర్మెంట్ ప్రకటించటం గమనార్హం.

Update: 2024-06-30 05:03 GMT

టీమిండియా టీ20 క్రికెట్ టీం కెప్టెన్ గా రోహిత్ శర్మ చరిత్రను క్రియేట్ చేశారు. టీ20తో పాటు టెస్టు, వన్డే క్రికెట్ మ్యాచ్ లకు టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. టీ20 ప్రపంచ క్రికెట్ కప్ ను సొంతం చేసుకోవాలని తపించిన రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫలించింది. ఏళ్లకు ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. టీమిండియా స్టార్ క్రికెటర్ గా ఎదిగిన రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచ కప్ విజేతగా తన జట్టు నిలిచిన రోజునే అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 37 ఏళ్ల రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన రోజునే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన రిటైర్మెంట్ ప్రకటించటం గమనార్హం.

ప్రపంచ కప్ ఫైనల్ ముగిసి.. కప్పును సొంతం చేసుకున్న ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న క్రికెట్ అభిమానుల సందడిలోనే రోహిత్ శర్మ.. కోహ్లీలు తమ అంతర్జాతీయ రిటైర్మెంట్ ను ప్రకటించారు. కాకుంటే.. టీ20ఫార్మాట్ కు మాత్రమే ఈ రిటైర్మెంట్ పరిమితం. తనకు ఇదే చివరి మ్యాచ్ అన్న రోహిత్.. ‘‘టీ20లకు ఇదే చివరి మ్యాచ్. వీడ్కోలుకు ఇంతకు మించి ప్రకటించే మంచి సందర్భం లేదు. ఈ ట్రోఫీని కచ్ఛితంగా గెలవాలనుకున్నా. ఈ విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావటం లేదు. నేను కోరుకున్నదే జరిగింది’’ అంటూ ఎక్సైట్ మెంట్ ను ప్రకటించారు.

Read more!

ఇలాంటి సందర్భం కూడా తన జీవితంలో ఎంతో ఎదురుచూసినట్లు చెప్పిన రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచ కప్ విజేతగా తన జట్టు నిలవటంపై తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 159 మ్యాచ్ లు ఆడిన రోహిత్.. 4231 పరుగులు చేశారు. ఇందులో ఐదు సెంచరీలు.. 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏమైనా.. ఒక అత్యద్భుతమైన రోజున భారత్ కు చెందిన ఇద్దరు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్లు ప్రకటించటం సంచలనంగా మారింది.

Tags:    

Similar News