ఈ సాలా ఐపీఎల్ లో ఈ టీమ్ ఔట్.. తొలి జట్టు ఇదే

7 మ్యాచ్ లు ఓ గెలుపు ఐపీఎల్ 17లో బెంగళూరు గెలుపునకు మొహం వాచిందనే చెప్పాలి. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడిన జట్టు ఒక్కటంటే ఒక్కటే దాంట్లో నెగ్గింది.

Update: 2024-04-16 11:30 GMT
ఈ సాలా ఐపీఎల్ లో ఈ టీమ్ ఔట్.. తొలి జట్టు ఇదే
  • whatsapp icon

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మంచి జట్లుగా ముద్రపడినంతనే సరిపోదు.. టైటిల్ కొట్టాలి.. ఒకటీ, రెండు సీజన్లు విఫలం అయితే సరే.. మరీ పది పదిహేనేళ్లు అయినా కూడా టైటిల్ గెలవలేకుంటే అది విఫల జట్టే.. ఈ కోవలోకి వచ్చేవి ఏవంటే.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. వీటిలో మొదటి రెండు జట్ల గురించి పెద్దగా పట్టింపు లేదు. కానీ, బెంగళూరు మాత్రం అందరికీ ఆసక్తికరమే.

 

17వ సీజనూ చేజారిపోతోంది..

ప్రతిసారి ఈ సాలా కప్ నమదే (ఈసారి కప్ మనదే) అంటూ బరిలో దిగడం.. ఉత్త చేతులతో వెనుదిరగడం.. ఇదీ ఐపీఎల్ లో బెంగళూరు పరిస్థితి. విరాట్ కోహ్లి లాంటి స్టార్ బ్యాటర్ జట్టులో ఉన్నప్పటికీ బెంగూళరు రాత మారడం లేదు. గత కొన్నేళ్లుగా మరీ తీసికట్టుగా తయారైంది జట్టు.

అయితే, కోహ్లి మరో రెండుమూడేళ్లు మాత్రమే ఆడగలడు అనుకుంటే.. అప్పటికైనా బెంగళూరు కప్ బెంగ తీరుతుందా? అంటే అనుమానమే. ప్రస్తుతం జరుగుతున్న 17వ సీజన్ లో బెంగళూరు పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది.

గెలిపించేవారెవరు?

ఇద్దరుముగ్గురు మంచి బ్యాటర్లు ఉంటే జట్టు మ్యాచ్ లు గెలిచేస్తుందనుకునే పరిస్థితి లేదు. బెంగళూరులో డుప్లెసిస్, కోహ్లి, దినేశ్ కార్తీక్ ఉన్నప్పటికీ.. వారు మాత్రమే ఎంతకని పోరాడగలరు..? మంచి పదును ఉన్న పేసర్లు లేనే లేరు.. మొహమ్మద్ సిరాజ్ వంటి హైదరాబాదీ పేసర్ ఉన్నప్పటికీ అతడు అవిశ్రాంతం ఆడుతూ అలసిపోయాడు. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చింది. మరో ఇండియన్ పేసర్ ఎవరూ బెంగళూరుకు దొరకలేదు. దీంతో విదేశీయులనే నమ్ముకుంటోంది.

7 మ్యాచ్ లు ఓ గెలుపు ఐపీఎల్ 17లో బెంగళూరు గెలుపునకు మొహం వాచిందనే చెప్పాలి. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడిన జట్టు ఒక్కటంటే ఒక్కటే దాంట్లో నెగ్గింది. రన్ రేట్ లో నూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్టు రన్ రేట్ (-1.185)తో ఉంది. ఇక మిగిలిన ఏడు మ్యాచ్ లనూ నెగ్గితేనే ప్లే ఆఫ్ చేరే చాన్సుంది. అయితే, ఇలా అద్భుతం జరిగినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News