షాట్ ఆఫ్ ది సెంచరీ... కొహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇక ఈ టోర్నీలో టీం ఇండియా... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ బెస్ట్ ఫెర్మార్మెన్స్ కనబరుస్తూ ఊహించని రీతిలో విజయాలు నమోదు చేస్తుంది.

Update: 2023-11-11 05:51 GMT

ప్రస్తుత వరల్డ్ కప్ లో టీం ఇండియా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వరుసగా ఆడిన ఎనిమిది మ్యాచ్ లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఈ టోర్నీలో టీం ఇండియా... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ బెస్ట్ ఫెర్మార్మెన్స్ కనబరుస్తూ ఊహించని రీతిలో విజయాలు నమోదు చేస్తుంది. అభిమానులకు ఆనందడోలికల్లో ముంచెత్తిస్తుంది.

ఇక ఈ టోర్నీలో ఇండియా బ్యాటర్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు విరాట్ కొహ్లీ! ఛేజింగ్ కింగ్ గా పేరు సంపాదించుకున్న కొహ్లీ... ఆ పేరుకు న్యాయం చేస్తూ ముందుకు పోతున్నాడు. ఈ క్రమంలోనే 49వ సెంచరీ పూర్తి చేసుకుని ఆ విషయంలో సచిన్ సరసన నిలిచాడు. ఈ క్రమంలో తాజాగా టీ20 ప్రపంచకప్‌ లో పాకిస్థాన్‌ తో మ్యాచ్‌ లో కొట్టిన సిక్స్ పై ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.

అవును... గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్‌ తో జరిగిన మ్యాచ్‌ లో హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌ లో విరాట్‌ నేరుగా కొట్టిన సిక్సర్‌ ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరన్నా అతిశయోక్తి కాదేమో. ఎవరూ ఊహించని రీతిలో ఆ సిక్స్ వెళ్లింది. దీనిపై స్పందించిన కొహ్లీ... "రవూఫ్‌ బౌలింగ్‌ లో కొట్టిన ఆ సిక్సర్‌ ను చాలాసార్లు చూశాను.. ఎంతో ప్రత్యేకమైన సమయమది.. ఈరోజు వరకు ఆ షాట్‌ ఎలా ఆడానో నాకే తెలియదు" అని పేర్కొన్నాడు.

ఇదే సమయంలో... పరిపూర్ణమైన బ్యాటర్‌ కావడంపై దృష్టి పెట్టడం కంటే కూడా కొత్త షాట్లు నేర్చుకోవడం మేలని అంటున్నాడు కొహ్లీ. అదేవిధంగా... టెక్నిక్‌, స్కిల్ మెరుగుపరుచుకోవడంలో రెండు విషయాలు ఉంటాయి. అందులో ఒకటి నేర్చుకున్న టెక్నిక్‌ మ్యాచ్‌ లు గెలవడానికి ఉపయోగపడడం.. లేకపోతే బ్యాటింగ్‌ మెరుగుపడడం. బ్యాటింగ్‌ లో మెరుగుపడడం అనే విషయం గురించి చాలామందికి అవగాహన ఉండదు" అని అన్నాడు.

అనంతరం... బ్యాటింగ్‌ కు ఇంకా ఏమేమి చేరిస్తే విజయానికి దగ్గరవుతామో ఆలోచిస్తే ఆట మెరుగవుతుంది. ఈ సమయంలో... పరిపూర్ణమైన బ్యాటర్‌ కావడంపై దృష్టి పెట్టడం కంటే ఎక్కువగా.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిది. దీని వల్ల అదనపు పరుగులు వస్తాయి.. ఫలితంగా జట్టు గెలుస్తుంది అని కొహ్లీ తన అనుభవాన్ని, అభిప్రాయాన్ని వెల్లడించాడు.

కాగా... ఈ వరల్డ్ కప్ లో 8 ఇన్నింగ్స్ లు ఆడిన కొహ్లీ 88 స్ట్రైక్ రేట్ తో 108 ఏవరేజ్ తో 543 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 4 అర్ధసెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. ఇందులో మూడు నాట్ ఔట్ లు కావడం గమనార్హం. ఇక రవూఫ్‌ బౌలింగ్‌ లో కొహ్లీ కొట్టిన ఆ సిక్సర్‌ ను ఇటీవల ఐసీసీ "షాట్ ఆఫ్ ది సెంచరీ"గా ప్రకటించిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News