కావ్య కళ్లల్లో ఆనందం కోసం... సన్‌ రైజర్స్ త్రయం కంటిన్యూ చేస్తారా?

Update: 2023-10-22 05:06 GMT

ఈ వరల్డ్ కప్ లో గెలుపోటముల సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రధానంగా చెప్పుకోవాల్సినవాటిలో సౌతాఫ్రికా టీం ఫెర్మార్మెన్స్ గురించి! ముఖ్యంగా బ్యాట్ తో సఫారీ బ్యాటర్స్ చేస్తున్న విన్యాసాలు, విధ్వంసాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకరిని మించి ఒకరు బంతిపై రివేంజ్ తీర్చుకుంటున్నట్లు బాదుతుంటే... ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి! ఈ సమయంలో సౌతాఫ్రికాలో ముగ్గురు ఆటగాళ్లు సన్ రైజర్స్ లో కీలకంగా ఉండగా... వారి ఫెర్మార్మెన్స్ ఇప్పుడు హైదరాబాద్ ఫ్యాన్స్ లో ఆశలు రేపుతుంది!

అవును... తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సఫారీలు పోటా పోటీగా బ్యాటింగ్ చేశారు. ఇందులో భాగంగా... హెన్రీచ్ క్లాసెన్ (67 బంతుల్లో 109: 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. రీజా హెండ్రీక్స్ (75 బంతుల్లో85; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), రాసీ వాన్ డెర్ డస్సెన్ (61 బంతుల్లో 60; 8 ఫోర్లు), మార్కో జాన్సెన్ (42 బంతుల్లో 75*; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 399 భారీ స్కోర్ వచ్చింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 22 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. గెరాల్డ్ కోయిట్జ్ (3/35) మూడు వికెట్లతో చెలరేగగా.. ఎంగిడి(2/26), మార్కో జాన్సెన్ (2/35) రెండేసి వికెట్లు తీసారు. రబడా, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు. దీంతో ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. ఇందులో సఫారీల విక్టరీలో క్లాసెన్, మార్కో, మార్కరమ్ లు కీ రోల్ పోషించారు.

ఇలా సన్ రైజర్స్ ఆటగాళ్లు... ప్రపంచకప్ లో చేస్తున్న సంచలన ప్రదర్శన‌కు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో... అప్‌ కమింగ్ ఐపీఎల్ - 2024 సీజన్‌ లో ఇదే జోరు కొనసాగిస్తే సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ కు తిరుగుండదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులొ మరిముఖ్యంగా... మార్కో హిడెన్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు. బౌలింగ్ ఆల్‌ రౌండర్‌ గా లోయరార్డర్‌ లో ఆడపా దడపా మెరుపులు మెరిపించడం మాత్రమే చూసిన అభిమానులు.. అతని విధ్వంసకర బ్యాటింగ్‌ కు అవాక్కయ్యారు.

ఈ మ్యాచ్ లో మార్కో జాన్సెన్ (42 బంతుల్లో 75*; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) బ్యాట్ తో రాణించడం, 2/35 తో బౌలింగ్ లోనూ రాణించడంతో... ఇదే ఫాం ఐపీఎల్ లోనూ కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఫలితంగా... సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ కావ్య మారన్ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సఫారీ క్రికెటర్స్ 2024 ఐపీఎల్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తారా.. లేక, ఈ ఫెర్మార్మెన్స్ ని వరల్డ్ కప్ కి మాత్రమే పరిమితం చేస్తారా అన్నది వేచి చూడాలి!

తప్పు తనదే అంటున్న ఇంగ్లండ్ కెప్టెన్!:

గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా సఫారీల చేతిలో ప్రపంచ కప్ మ్యాచ్ లో ఇంగ్లిష్ టీం ఘోర ఓటమి చవిచూడటంపై కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు. పేలవ బౌలింగ్‌ తో పాటు చెత్త బ్యాటింగ్‌ జట్టుకు ఈ పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పాడు. వేడి వాతావరణంలో ముందుగా బ్యాటింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుందనే బౌలింగ్ ఎంచుకున్నానని వివరణ ఇచ్చాడు. అయితే తన వ్యూహం బెడిసికొట్టిందని తెలుసుకున్నట్లు ప్రకటించాడు!

Tags:    

Similar News