టి20 ప్రపంచకప్ లో భారత్ భారీ రిస్క్.. టైటిల్ కష్టమే?
టి20 అంటేనే ధనాధన్ ఇన్నింగ్స్ లు. అలాంటిది ప్రపంచ కప్ అంటే ఇంకెంత మజా ఉండాలి..? కానీ, వెస్టిండీస్ దీవుల్లో ఇలాంటి ఇన్నింగ్స్ సాధ్యమా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
సంప్రదాయ క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లండ్.. టి20 ఫార్మాట్ మెట్టిల్లు కరీబియన్ దీవులు.. పూరన్, హెట్ మెయిర్, రస్సెల్, పావెల్ వంటి ప్రస్తుత టి20 స్పెషలిస్టులైన వెస్టిండీస్ ఆటగాళ్లను చూస్తే.. ఒకప్పటి టెస్టుల్లో అరివీర భయంకర కరీబియన్ ప్లేయర్లు గుర్తొస్తారు. అయితే, అదేమి చిత్రమో కానీ.. వెస్టిండీస్ ఆటగాళ్లు ఎంతటి విధ్వంసకారులో.. ఆ దీవుల్లోని పిచ్ లు అంత నెమ్మది. సహజంగా అయితే భారత పిచ్ లు బ్యాట్స్ మెన్ కు స్వర్గధామాలు. స్పిన్ కు కొంత మాత్రమే అనుకూలిస్తాయి. కానీ, వెస్టిండీస్ పిచ్ లు మరీ నెమ్మది. దీంతోనే అవి స్పిన్ కు సహకరిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో జరిగే టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఎలా స్పందిస్తాయోననే సందేహం నెలకొంది.
మజా ఉంటుందా? ఉండదా?
టి20 అంటేనే ధనాధన్ ఇన్నింగ్స్ లు. అలాంటిది ప్రపంచ కప్ అంటే ఇంకెంత మజా ఉండాలి..? కానీ, వెస్టిండీస్ దీవుల్లో ఇలాంటి ఇన్నింగ్స్ సాధ్యమా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు జట్లన్నీ ఇప్పటికే కరీబియన్ దీవులకు చేరుకుని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతున్నాయి. భారత జట్టు కూడా శనివారం బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతోంది. జూన్ 5న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. మొత్తం 15 మంది సభ్యుల్లో నలుగురు స్పిన్నర్లు. అయితే, ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు. మరో ఇద్దరు స్పెషలిస్ట్ బౌలర్లు. అయితే, ఇది సరైనది కాదని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. ఒకరకంగా ఇది రిస్క్ చేసినట్లేనని పేర్కొంటున్నాడు. టీమిండియా స్పిన్ నే ఎక్కువగా నమ్ముకుందని.. ఆస్ట్రేలియాకు ఇది పూర్తి భిన్నం. కరీబియన్ పరిస్థితుల్లో స్పిన్ ను ఎదుర్కోవడంపైనే భారత జట్టు విజయాలు ఆధారపడి ఉంటాయి. కప్ నెగ్గాలనే జట్లకు టీమిండియానే పెద్ద ముప్పు. ఫేవరెట్ ఎవరో చెప్పడం కష్టమే. టీమిండియా మాత్రం ఒక ఫేవరెట్. దీనికి కారణం పొట్టి ఫార్మాట్ లో చాలా క్రికెట్ ఆడింది. అందరికంటే బాగా సన్నద్ధమైంది’’ అని క్లార్క్ విశ్లేషించాడు.
కాగా, వెస్టిండీస్ దీవులు, భారత్ లోని పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చని.. అయితే, పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఫలితంగా భారత క్రికెటర్లకు ఉపయోగపడతాయని వివరించాడు.