కోహ్లీ సెంచరీకి అంపైర్ సాయం చేయలేదు.. రూలు ఉంది అక్కడ!

ఇందులో భాగంగా... ఈ మోడ్రన్ క్రికెట్‌ లో బ్యాటర్లు.. బౌలర్లు బంతి వేయకముందే అటు ఇటు కదులుతుండటం.. స్వీప్, రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో భాగంగా క్రీజులో అటూ ఇటూ కదులుతుండటం చేస్తుంటారు.

Update: 2023-10-21 07:34 GMT

వన్డే ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ లో విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. సెంచరీ కోసం విరాట్ కోహ్లీ భారత విజయాన్ని ఆలస్యం చేశాడని కొంతమంది సీనియర్లు అంటుంటే... అంపైర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి అతనికి సహకరించాడని మరికొంతమంది ఆరోపించారు. దీంతో అంపైర్ రిచర్డ్ కెటిల్ బరోపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడిచాయి.

అవును... బంగ్లా బౌలర్ వైడ్ వేసినా వైడ్ ఇవ్వకుండా.. పైగా గెడ్డం పై చేయిపెట్టి ఏదో ఆలోచిస్తున్నట్లు ఫెర్మార్మెన్స్ చేశారని సోషల్ మీడియాలో కెటిల్ బరోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా మరికొంతమంది మరింత వైరల్ చేసే పనికి పూనుకున్నారు. అయితే నిజం చెప్పులేసుకునేలోపు అబద్దం ఊరంతా చుట్టి వచ్చేస్తాదనే టైపులు ఒక వాస్తవం వెలుగులోకి వచ్చింది.

ఇందులో భాగంగా... కోహ్లీ కోసమే అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో వైడ్ ఇవ్వలేదని అంతా అనుకుని ఆయనను ఆడిపోసుకుంటున్న తరుణంలో... అతను నిబంధనల మేరకే ఈ బంతిని వైడ్‌ గా ప్రకటించలేదనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. క్రికెట్ నియమాలను మార్చే మెల్ బోర్న్ క్రికెట్‌ క్లబ్ (ఎంసీసీ) 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్‌ లో వైడ్ విషయంలో పలు మార్పులు చేసిందనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... ఈ మోడ్రన్ క్రికెట్‌ లో బ్యాటర్లు.. బౌలర్లు బంతి వేయకముందే అటు ఇటు కదులుతుండటం.. స్వీప్, రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో భాగంగా క్రీజులో అటూ ఇటూ కదులుతుండటం చేస్తుంటారు. దీంతో వైడ్ బాల్ విషయంలో ఎంసీసీ ఈ మార్పులు తీసుకొచ్చిందట. ఇలా బంతి వేయకముందే బ్యాటర్ కదిలితే.. ఆ సమయంలో వారి పక్క నుంచే వెళ్లిన బంతి వైడ్ ఇవ్వడం సమంజసం కాదని భావించిన ఎంసీసీ ఈ నిబంధనను మార్చిందని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే క్రికెట్ నిబంధనల్లోని 22.1 రూల్‌ ను సవరించింది. బౌలర్ తన రనప్ ప్రారంభించినప్పుడు బ్యాటర్ మూవ్‌మెంట్ ఇచ్చి, ఆ తర్వాత బ్యాటింగ్ పొజిషన్‌ కు వెళ్లినప్పటికీ కదిలిన చోటునే పరిగణలోకి తీసుకోవాలని, ఆ ప్లేస్‌ ను బట్టే వైడ్‌ ని డిసైడ్ చేసి నిర్ణయాన్ని ప్రకటించాలని మార్పు చేసింది! ఈ రూల్ ప్రకారమే నసుమ్ బౌలింగ్ రన్నప్ ప్రారంభించగానే కొహ్లీ లెగ్ స్టంప్ వైపు జరిగి.. బంతి పడగానే ముందుకు జరిగాడు.

దీంతో.. కొత్త నిబంధనలను పరిగణలోకి తీసుకున్న కెటిల్ బరో... ఆ బంతిని వైడ్ ఇవ్వలేదు! దీంతో అప్పుడున్న పరిస్థితుల్లో ఇదేదో కొహ్లీకి ఫేవర్ గా తీసుకున్న నిర్ణయం అని చాలా మంది ఫైరవుతున్నారు. ఒకవేళ మామూలు పరిస్థితుల్లో అయితే... ఇండియన్ ఫ్యాన్స్... అది ఎందుకు వైడ్ కాదని అంపైర్ పై ట్రోల్స్ చేసేవారు! దీంతో... కెటిల్ బరో జెన్యూన్ గానే నిర్ణయం ప్రకటించారు.. ఫ్యాన్స్ అప్ డేట్ కాలేదంతే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News