మైదానంలో కింగ్ అయినా తల్లికి కొడుకే... విరాట్ కామెంట్స్ వైరల్!

తాజాగా స్టార్ స్పోర్ట్స్‌ లో తన తల్లికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కొహ్లీ... "నా తల్లిని చూసుకోవడం నాకు చాలా ముఖ్యమైన విషయం.

Update: 2023-10-27 01:30 GMT
మైదానంలో కింగ్  అయినా తల్లికి కొడుకే... విరాట్  కామెంట్స్  వైరల్!
  • whatsapp icon

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని అంటారు! బిడ్డ మహారాజైనా తల్లి దృష్టిలో ఇంకా చిన్నపిల్లాడుగానే ఉంటుందని చెబుతారు! తన బిడ్డ మరో బిడ్డకు తండ్రైనా కూడా... ఆ తల్లి దృష్టిలో తానింకా చిన్నపిల్లాడే.. సరిగ్గా తినడం కూడా రాదనే అనుకుంటుంది. అందుకే దేవుడు అన్ని చోట్లా ఉండలేక తల్లిని సృష్టించాడని చెబుతారు. ఈ సమయంలో తనపై తనతల్లి చూపించే ప్రేమ.. తన తల్లిపై తాను చూపించే ప్రేమపై కొహ్లీ తాజాగా స్పందించాడు.

అవును... ఆటతీరుతోపాటు ఫిట్‌ నెస్ విషయంలోనూ ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా నిలిచిన టీమిండియా కింగ్ విరాట్ కోహ్లి... బాగా ఫ్యామిలీ పర్సన్ అని అంటుంటారు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ కి ఎక్కువగా విలువిస్తాడని చెబుతుంటారు. ఈ సమయంలో తాజాగా కొహ్లీ స్పందించిన విధానంతో... అతని ప్రవర్తన, మాట తీరు అతని ఫ్యామిలీ ఎమోషన్స్ ని తెలియజేస్తున్నాయని అంటున్నారు.


మైదానంలో రికార్డులు బద్దలు కొట్టే గొప్ప ఆటగాడే కాకుండా.. వ్యక్తిత్వం, ఫ్యామిలీ సెంటిమెంట్స్ లో కూడా కోహ్లీ వ్యక్తి అని అంటారు. ఈ మాటలకు బలం చేకూర్చే సంఘటన తాజాగా జరిగింది. ఇందులో భాగంగా... విరాట్ కోహ్లీ తాజాగా తన తొలి ప్రేమ పేరును వెల్లడించాడు. అది మరెవరో కాదు... తన తల్లి!

తాజాగా స్టార్ స్పోర్ట్స్‌ లో తన తల్లికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కొహ్లీ... "నా తల్లిని చూసుకోవడం నాకు చాలా ముఖ్యమైన విషయం. ఆమె ఆనందమే నాకు సర్వస్వం. ఆమెకు సంతోషం కలిగించే చిన్న చిన్న విషయాలే నన్ను కూడా సంతోషపరుస్తాయి" అని అన్నాడు. దీంతో... విరాట్ తన తల్లికి ఎంత సన్నిహితంగా ఉంటాడో ఈ ప్రకటన తెలియజేస్తోందని అంటున్నారు.

విరాట్ కోహ్లీ తల్లి పేరు సరోజ్ కోహ్లీ, కాగా.. ఆమె ఢిల్లీలో నివసిస్తున్నారు. క్రికెట్ నుంచి విరామం దొరికితే చాలు కొహ్లీ తన తల్లిని కలవడానికి ఢిల్లీకి వస్తుంటాడట. గతంలో కూడా ఈ విషయాలపై స్పందించిన కొహ్లీ... తన హెల్త్ విషయంలో, ఫుడ్ విషయంలో తల్లి ఏవిధంగా ఆందోళన చెందుతుందనే విషయాన్నీ వెల్లడించాడు.

ఇందులో భాగంగా.. "నా ఫిట్‌ నెస్ విషయంలో ప్రపంచమంతా నన్ను మెచ్చుకుంటున్నప్పుడు.., నాకు ఏదో వ్యాధి ఉందని, అందుకే నేను బరువు తగ్గుతున్నానని మా అమ్మ అనుకుంటుంది. అందుకే.. తరచూ ఫోన్ చేసి నువ్వు తిన్నావా లేదా అని అడుగుతుంది" అని కొహ్లీ తనపై అమ్మ చూపించే ప్రేమను చెప్పుకొచ్చాడు! ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి!

కాగా... భారత్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న 2023 ప్రపంచకప్‌ లో విరాట్ కోహ్లీ బ్యాట్ జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కోహ్లీ 5 మ్యాచ్‌ ల్లో ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో 354 పరుగులు చేశాడు. రాబోయే మ్యాచ్ లలోనూ కోహ్లి తన ఫాం ను ఇలాగే కొనసాగించాలని ఈ సందర్భంగా భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News