రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు... విరాట్ కొహ్లీ కొత్త రికార్డ్స్ ఇవే!
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో చాలా రికార్డులే నమోదయ్యాయి
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో చాలా రికార్డులే నమోదయ్యాయి. ఈ మ్యాచ్ లో రెండు సెంచరీలూ నమోదయ్యాయి. ఇక ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రికార్డుల వీరుడు కింగ్ కొహ్లీ గురించి. క్రికెట్ లో ఏ ఫార్మేట్ లో అయినా రికార్డ్ అనేది ఉంటే... అందులో కచ్చితంగా కొహ్లీ పేరు ఉంటుందని అంటారు. అస్థాయిలో పరుగుల దాహంతో నిండిపోయి ఉంటాడు కొహ్లీ!
ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ తన పరుగుల దాహాన్ని బయటపెట్టాడు. ఇందులో భాగంగా... ఓపెనింగ్ బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చి సెంచరీ చేసి నాటౌట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో 72 బంతులు ఎదుర్కొన్న కొహ్లీ 12 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇందులో మొదటి 25 బంతుల్లోనూ 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 32 పరుగులు చేసిన కొహ్లీ.. తర్వాత 25 బంతుల్లోనూ 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 39 పరుగులు చేశాడు. ఇక ఆఖరి 22 బంతుల్లోనూ 6 ఫోర్లు 1 సిక్స్ తో 42 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్ లో 5 మ్యాచ్ లకే 316 పరుగులతో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు కోహ్లి.
ఇదే సమయంలో... ఈ సీజన్ లో నమోదైన తొలి సెంచరీ కూడా కొహ్లీ పేరునే ఉండగా... రెండో సెంచరీ బట్లర్ సాధించాడు. ఇలా ఐపీఎల్ లో కొహ్లీ సాధించిన సెంచరీలు 8 కాగా... ఈ జాబితాలోనూ కింగ్ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో బట్లర్ (6), క్రిస్ గేల్ (6) ఉన్నారు.
ఇదే క్రమంలో... ఐపీఎల్ లో అతని వ్యక్తిగత టాప్ స్కోర్ ని అతడే సమం చేసుకున్నాడు కోహ్లీ. ఇందులో భాగంగా... 2016లో పంజాబ్ పై కొహ్లీ 113 పరుగులే సాధించాడు. ఇదే సమయంలో తాజాగా రాజస్థాన్ పైనా 113 పరుగులు చేశాడు.
ఇక తాజా సెంచరీతో ఐపీఎల్ లో ఇప్పటివరకూ కొహ్లీ చేసిన పరుగులు 7579కి చేరుకున్నాయి. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగుల వీరుల్లో నంబర్ వన్ గా కొహ్లీనే ఉన్నాడు. 234లో ఇన్నింగ్స్ లో ఇలా 7500 మైలురాయిని దాటాడు. ఆ తర్వాత స్థానంలో శిఖర్ ధావన్ 220 ఇన్నింగ్స్ ల్లో 6755 పరుగులతో ఉన్నాడు.
ఇదే సమయంలో వికెట్ కీపర్ కాకుండా ఐపీఎల్ లో అత్యధిక క్యాచ్ లు తీసుకున్న ప్లేయర్ గా కూడా కొహ్లీ రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం అతడు అందుకున్న క్యాచ్ లు 110.