ఆ స్టార్ క్రికెటర్ కు వరల్డ్ కప్ టికెట్ల బెంగ

ఎవరూ టోర్నీ ముగిసే వరకు టికెట్ల కోసం విసిగించవద్దు. ఇంటిలో నుంచే మ్యాచ్‌లను ఆస్వాదించండి. ప్లీజ్" అని ఇన్ స్టాగ్రామ్ లో ఫన్నీ ఏమోజీతో పేర్కొన్నాడు.

Update: 2023-10-04 08:44 GMT

ఎప్పుడెప్పుడా అని నెలల తరబడిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ క్రికెట్ మరికొద్ది గంటల్లో మొదలుకానుంది. టీమిండియా ఈసారి విజేతగా నిలుస్తుందని కోట్లాది అభిమానులు ఆశగా ఉన్నారు. అందులోనూ సొంతగడ్డపై జరుగుతుండడం.. కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్ వంటి స్టార్లు జోరుమీద ఉండడం.. బుమ్రా, రాహుల్ వంటి వారు తిరిగిరావడంతో టీమిండియ పటిష్టంగా కనిపిస్తోంది. అందుకనే మన జట్టు ప్రపంచ విజేతగా నిలుస్తుందనే నమ్ముతున్నారు.

పదేళ్లయింది ప్రపంచ విజేతగా నిలిచి టీమిండియా 2013లో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. ఆ తర్వాత మరెప్పుడూ ఐసీసీ టోర్నీల్లో నెగ్గలేదు. అంతకుముందు 2011లో సొంతగడ్డపై ప్రపంచ విజేతగా నిలిచింది. మొత్తానికి చూస్తే 2007 నాటి తొలి టి20 ప్రపంచ కప్ తప్ప మరెప్పుడూ ఆ కప్ నూ గెలవలేదు.


హాట్ ఫేవరెట్.. కానీ,సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీ కాబట్టి టీమిండియా ఎలాగూ హాట్ ఫేవరెట్టే. 2011లో కంటే ఇప్పటి పిచ్ లు మన జట్టుకు మరింత కొట్టినపిండి. ఎందుకంటే నాడు ఐపీఎల్ మూడు సీజన్లే జరిగాయి. ఇప్పుడు మరో 13 సీజన్లు పూర్తయ్యాయి. ఇది ఆటగాళ్లకు ఎంతైనా మేలు చేసేదే. అందులోనూ కోహ్లి, రోహిత్ వంటివారికి.

ఫీవర్ కమ్మేసింది.. టికెట్ కావాలంటుంది ఆఫీసులకు డుమ్మా కొట్టడం.. టీవీలకు అతుక్కుపోవడం.. లేని జ్వరాన్ని ఉన్నట్లుగా చెప్పి పనులు ఎగ్గొట్టడం.. ప్రపంచ కప్ అంటే ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. క్రికెట్ ఫీవర్ అలాంటిది మరి. ఇక మన దేశంలోనే కప్ జరుగుతుంది కాబట్టి కనీసం ఒక్క మ్యాచ్ అయినా చూడాలనే కోరిక గట్టిగా ఉండడంలో తప్పులేదు.

ఆ స్టార్ కూ తప్పలేదు టికెట్ కటకట భారత్ లో రెండే రెండు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. ఒకటి సినిమా టిక్కెట్లు, రెండు క్రికెట మ్యాచ్ టికెట్లు. ఆ సందర్భంగా తెలిసినవారు, టికెట్ తెచ్చే సామర్థ్యం ఉన్నవారిని పదేపదే అడుగుతుంటారు. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఇలాంటి పరిస్థితే క్రికెట్ భారత ఆటగాళ్లకు ఎదురవుతోంది. వారిసన్నిహితులు, బంధువులు, మిత్రుల నుంచి మ్యాచ్ టికెట్ల కోసం ఒత్తిడి పెరిగింది.

ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందే సిద్దమయ్యాడు. సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్, బంధువులు, సన్నిహితులతో పాటు అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. "ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నా స్నేహితులందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ టోర్నీ ముగిసే వరకు టికెట్ల కోసం విసిగించవద్దు. ఇంటిలో నుంచే మ్యాచ్‌లను ఆస్వాదించండి. ప్లీజ్" అని ఇన్ స్టాగ్రామ్ లో ఫన్నీ ఏమోజీతో పేర్కొన్నాడు.

విరాట్ దే తప్పు.. నన్నేమీ అనొద్దు తన భర్త విరాట్ కోహ్లి పోస్ట్ పై బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తనదైన శైలిలో బదులిచ్చింది. అసలే ఆమె సినిమా స్టార్ కావడంతో అటువైపు నుంచి కూడా టికెట్లకు ఒత్తిడి ఉంటుందేమో? దీన్ని గమనించే.. "కోహ్లీ టికెట్లు కాదన్నాడని నన్ను ఇబ్బంది పెట్టొద్దు" అని కోరింది. అలా.. తనకు తన భర్తకు ఇద్దరికీ ఇబ్బంది లేకుండా చూసుకుందన్నమాట.

Tags:    

Similar News