కొడుకును కాదని కోహ్లీ ఆట చూసింది

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. కెరీర్ లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కింగ్ కోహ్లీ 121 పరుగులు చేసిన కోహ్లీ రనౌట్ అయ్యాడు

Update: 2023-07-22 16:03 GMT

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. కెరీర్ లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కింగ్ కోహ్లీ 121 పరుగులు చేసిన కోహ్లీ రనౌట్ అయ్యాడు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (61), అశ్విన్(56), యశస్వి జైస్వాల్ (57), కెప్టెన్ రోహిత్ శర్మ (80) పరుగులు చేశారు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య విండీస్ ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.

ఈ టెస్టు సందర్భంగా మరో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సాధారణంగా ఏ తల్లి అయినా ప్రత్యర్థులపై తన కొడుకు ఆటతీరును చూసేందుకు స్టేడియానికి వస్తుంది. కానీ, విండీస్ వికెట్ కీపర్ జాషువా తల్లి మాత్రం కింగ్ కోహ్లీ ఆట చూసేందుకు స్టేడియానికి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీకి జాషువా చెప్పడం స్టంప్ మైక్ లో రికార్డయింది. అయితే తన ఆటను చూడడానికి రాకపోవడంతో కాస్త ఫీల్ అయ్యానని, కానీ, తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించిన తన తల్లిని తాను అర్థం చేసుకున్నానని చెప్పాడు.

తాను అభిమానించే కోహ్లీ తాను వచ్చిన రోజే సెంచరీ కొట్టడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. దీంతో, మ్యాచ్ ముగిసిన తర్వాత బస్ దగ్గరకు జాషువా తల్లి వచ్చి కోహ్లీని ఆప్యాయంగా కౌగిలించుకుంది. తనతోపాటు జాషువా విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానులం అని, కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు మాత్రమే స్టేడియానికి వచ్చానని చెప్పింది. తమ జీవితకాలంలో విరాట్ అత్యుత్తమ బ్యాట్స్‌మ్యాన్ అని, కోహ్లీతో కలిసి తన కొడుకు ఒకే మైదానంలో ఆడడం ఎంతో గౌరవంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ సీన్ చూసి కోహ్లీపై విండీస్ కీపర్ అసూయపడ్డాడని నెటిజన్లు అంటున్నారు.

Tags:    

Similar News