టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్‌?... ధోనీ పేరు తెచ్చిన విరాట్ కోచ్!

ఈ సందర్భంగా నూతన కోచ్ విషయంలో బీసీసీఐ ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చిందని అంటున్నారు.

Update: 2024-05-28 17:09 GMT

భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకొనేందుకు సోమవారంతో గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదవికి ఎవరు దరఖాస్తు చేశారు? ఎవరెవరి దరఖాస్తులు చెల్లుబాటు అయ్యాయనే విషయాలను ఇంకా బీసీసీఐ వెల్లడించలేదు. అయినప్పటికీ కోచ్ విషయంలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సందర్భంగా నూతన కోచ్ విషయంలో బీసీసీఐ ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చిందని అంటున్నారు.

అవును... రాహుల్‌ ద్రవిడ్‌ వారుసుడిగా టీం ఇండియా హెడ్‌ కోచ్‌ గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే విషయంపై ఉత్కంఠకు బీసీసీఐ త్వరలో తెరదించబోతోందని అంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో కీలక భూమిక పోషించిన గౌతం గంభీర్ పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే టీం ఇండియా హెడ్‌ కోచ్‌ గా గౌతం గంభీర్‌ ఖారారు అయినట్లు కథనాలు మొదలయ్యాయి. వాస్తవానికి గతకొన్ని రోజులుగా టీమిండియాకు హెడ్‌ కోచ్‌ గా గంభీర్‌ వస్తాడనే వార్తలు వస్తున్న క్రమంలో.. బీసీసీఐ పెద్దలకు ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లు చెబుతున్నారు.

దీంతో... అన్నీ అనుకూలంగా జరిగితే ఒక మంచి ముహూర్తం చూసుకుని టీమిండియా హెడ్‌ కోచ్‌ గా గంభీర్‌ పేరును త్వరలోనే బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు! కాగా... టీ20 వరల్డ్ కప్‌ 2024 తర్వాత ద్రవిడ్‌ పదవీ కాలం ముగియనున్న సంగతి తెలిసిందే.

గంభీర్‌ కంటే ధోనీ బెటర్..!:

భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవికి సంబంధించిన రేసులో గౌతం గంభీర్‌ ముందున్నాడనే మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో... విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌ కుమార్ శర్మ మాత్రం తాజాగా సరికొత్త పేరు తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... టీం ఇండియా మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ప్రధాన కోచ్‌ గా నియమిస్తే బాగుంటుందని శర్మ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News