కొహ్లీ సెంచరీకి ముందు వైడ్ బాల్... స్పందించిన బంగ్లా కెప్టెన్!
ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీ సంగతేమో కానీ... ఆ సెంచరీ తర్వాత అంపైర్ పై మాత్రం ట్రోలింగ్స్ జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత అలాంటి ఒక రూల్ ఉందని తెలిసి చాలామంది నాలుక కరుచుకున్నారు! అంతకముందు అంపైర్ కెటిల్ బరో పై మాత్రం చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా చాలా మంది ట్రోల్ చేశారు. అందుకు సంబంధించిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆ సెంచరీకి ముందు బంతి వైడ్ ఇవ్వకపోవడం, అసలు ఆ సమయంలో వైడ్ బాల్ వేయాలని బౌలర్ భావించడం, అది కరెక్ట్ క్రికెట్ కాదనే కామెంట్లు వినిపిస్తుండటంపై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో స్పందించాడు. ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ సూచన మేరకే బౌలర్ నసూమ్ అహ్మద్ ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్ వేసి కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడనడం కరెక్ట్ కాదని తెలిపాడు.
ఇదే సమయంలో వైడ్ బాల్ వేయాలని ప్రత్యేక వ్యూహం అంటూ ఏమీ లేదని, సాధారణంగా అలా జరిగిపోయిందని వివరించాడు. ఇదే సమయంలో వైడ్ బాల్ వేయాలనే ఉద్దేశం ఏ బౌలర్ కు ఉండదని, సరైన ఆట ఆడేందుకు తాము ప్రయత్నించామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా... అది ఎట్టిపరిస్థితిఉల్లోనూ ఉద్దేశ్యపూర్వకంగా వైడ్ వేయాలని వేసిన బాల్ కాదని పునరుధ్ఘాటించాడు.
కాగా... ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ, దానికి ఒక బాల్ ముందు అంపైర్ తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 42 ఓవర్ లో మూడో బంతికి సిక్సర్ బాది జట్టును విజయ తీరాలకు చేర్చడంతోపాటు శతకం పూర్తి చేసుకున్నాడు కొహ్లీ.
అయితే.. నసూమ్ అహ్మ ద్ 42 ఓవర్ ప్రారంభించడానికి ముందు కోహ్లీ 97 పరుగులతో ఉండగా.. మరో రెండు పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ చేస్తాడా.. లేదా.. అని ఉత్కంఠ మొదలైంది. ఈ ఓవర్ లో తొలి బంతి వైడ్ లా అనిపించింది. బంతి లెగ్ సైడ్ వెళ్లడంతో అంపైర్ వైడ్ ఇస్తాడా అన్నట్లుగా కోహ్లి చూశాడు.
కానీ అంపైర్ వైడ్ ఇవ్వలేదు. ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కావాలనే వైడ్ వేయాలని బంగ్లా బౌలర్లు ప్లాన్ చేశారని ఒకరంటే... కావాలనే అంపైర్ వైడ్ ఇవ్వలేదని మరికొంతమంది కామెంట్ చేశారు. తాజాగా ఈ విషయంపై ఈ విధంగా బంగ్లా కెప్టెన్ క్లారిటీ ఇచ్చాడు.