బౌలర్లపై జాలి లేని జాక్స్ విధ్వంసం... టాప్ 5 జాబితాలో స్థానం!

అవును... ఐపీఎల్‌-2024 లో భాగంగా అహ్మదాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌ తో జ‌రిగిన‌ మ్యాచ్‌ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట‌గాడు విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు.

Update: 2024-04-29 04:18 GMT

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోతున్నారనే చెప్పాలి. ప్రధానంగా నిన్నమొన్నటివరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్, చెన్నై బ్యాటర్స్ మరింత చెలరేగిపోతుంటే... తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. మొదట్లో స్లోగా స్టార్ట్ చేసిన జాక్స్... తర్వాత విధ్వంసం చేశాడు. మైదానంలో ఫీల్డర్స్ కి పరుగెత్తే అవసరం లేకుండా.. బంతులను స్టాండ్స్ లోకి పంపేవాడు.

అవును... ఐపీఎల్‌-2024 లో భాగంగా అహ్మదాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌ తో జ‌రిగిన‌ మ్యాచ్‌ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట‌గాడు విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 201 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. గుజ‌రాత్ బౌల‌ర్లను ఊచ‌కోత కోశాడు. బంతిపై పగ ఉన్నట్లు, బౌలర్లపై జాలి లేనట్లు సాగిన అతడి విధ్వంసం... టాప్ 5 హిట్టర్స్ జాబితాలో చోటు కల్పించింది.

ఈ మ్యాచ్ లో కోహ్లి ఒకవైపు బాదుతుంటే మరోవైపు ఓపిగ్గా బంతికో పరుగు చొప్పున చేస్తూ మద్దతు ఇచ్చిన జాక్స్‌.. మొదట 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. అనంతరం కాస్త డోసుపెంచి.. 22 బంతుల్లో 29 పరుగులకు చేరుకున్నాడు. కానీ అక్కడ నుంచి పూనకం వచ్చినట్టు బౌలర్లపై పడిపోయాడు. బంతిని కసిగా కొట్టడం.. అది వెళ్లి ప్రేక్షకుల్లో పడడం రోటీనైపోయిందన్నా అతిశయోక్తి కాదు.

ఈ క్రమంలో... 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జాక్స్‌.. కేవలం మరో పది బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. చివర్లో... ఆర్సీబీ విజయానికి 36 బంతుల్లో 54 పరుగులు అవసరం అయిన చోట... ఉంటే రెండు ఓవర్లలోనే మ్యాచ్ పూర్తయిందంటే జాక్స్‌ విధ్వంసాన్ని ఊహించొచ్చు. ఫలితంగా... కేవ‌లం 41 బంతుల్లోనే జాక్స్ త‌న సెంచ‌రీ మార్క్‌ ను అందుకున్నాడు.

మొదటి 31 బంతుల్లో 50 పూర్తి చేసి, ఆ తర్వాత 10 బంతుల్లోనే మరో 50 బాదిన జాక్స్... 41 బంతుల్లో తన ఐపీఎల్ ఫస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 10 సిక్స్‌ లు ఉండటం గమనార్హం. అంటే... 100 పరుగుల్లోనూ 80 పరుగులు బౌండరీలతోనే వచ్చాయన్నమాట. ఈ క్రమలో.. జాక్స్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఇందులో భాగంగా... ఐపీఎల్‌ లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ఐదో ఆట‌గాడిగా నిలిచాడు.

తక్కువ బంతుల్లో సెంచరీలు చేసిన ఆటగాళ్లు:

క్రిస్ గేల్ - 30 బంతుల్లో

యూసఫ్ పఠాన్ - 37 బంతుల్లో

డేవిడ్ మిల్లర్ - 38 బంతుల్లో

ట్రావిస్ హెడ్ - 39 బంతుల్లో

విల్ జాక్స్ - 41 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

Tags:    

Similar News