నెట్ ఫ్లిక్స్ టాప్ కంటెంట్.. ఈజీగా కొట్టేసిన లక్కీ భాస్కర్
బిగ్ స్క్రీన్ పైన బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకి ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడని ఆడియన్స్ మెజారిటీగా ఓటీటీలను ఫాలో అవుతారు.
బిగ్ స్క్రీన్ పైన బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకి ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడని ఆడియన్స్ మెజారిటీగా ఓటీటీలను ఫాలో అవుతారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మధ్యకాలంలో ఓటీటీల వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అందుకే థియేటర్స్ లో రిలీజ్ అయిన మూడు, నాలుగు వారాల్లోనే కొత్త సినిమాలని ఓటీటీలోకి తీసుకొని వస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘లక్కీ భాస్కర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ మూవీ ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంది. దుల్కర్ సల్మాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకున్న ఈ సినిమాపై ఆర్ధిక నిపుణులు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ దశాబ్దంలో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ‘లక్కీ భాస్కర్’ కూడా ఒకటని అన్నారు.
అలాగే ఈ సినిమాలో చాలా జీవిత పాఠాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే నెట్ ఫ్లిక్స్ లో వారం రోజుల క్రితం ‘లక్కీ భాస్కర్’ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఆ ఓటీటీలో ఈ చిత్రం అరుదైన ఫీట్ అందుకుంది. పాన్ ఇండియా సినిమాలపైనే ‘కల్కి 2898ఏడీ’, ‘దేవర’ సినిమాలని వ్యూవర్ షిప్ ని ఈ సినిమా బీట్ చేసింది. మొదటి వారంలోనే ‘లక్కీ భాస్కర్’ 11.7 మిలియన్ వ్యూవ్స్ ని ఈ చిత్రం సాధించింది. ‘కల్కి’ మూవీ మొదటి వారంలో 5.1, ‘దేవర’ 8.6 మిలియన్ వ్యూవ్స్ ని మాత్రమే అందుకున్నాయి.
వీటిని ‘లక్కీ భాస్కర్’ క్రాస్ చేసిందంటే ఏ స్థాయిలో మూవీకి ఆదరణ వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక రెండో వారంలో కూడా ఇప్పటికే 6.6 మిలియన్ వ్యూవ్స్ తో నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో టాప్ 10లో ‘లక్కీ భాస్కర్’ ఉంది. అయితే ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో మొదటి వారం అత్యధిక వ్యూవ్స్ సాధించిన సినిమాగా విజయ్ సేతుపతి ‘మహారాజ’ ఉంది. ఈ చిత్రం ఏకంగా 19.7 మిలియన్ వ్యూవ్స్ సాధించింది.
అలాగే ‘ఇండియన్ 2’, ‘సరిపోదా శనివారం’ సినిమాలు కూడా అత్యధిక వ్యూవ్స్ సాధించిన సినిమాల జాబితాలో ఉన్నాయి. థియేటర్స్ లో సక్సెస్ అయిన సినిమాలతో పాటు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్ కి కూడా ఓటీటీలో మంచి వ్యువర్ షిప్ రావడానికి కారణం ఆ సినిమాలపై పబ్లిక్ కి ఉన్న క్రేజ్ అని చెప్పొచ్చు.