ఎట్టకేలకు ఓటీటీలోకి 'ది కేరళ స్టోరీ'!
ఈ నెలలోనే సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. జనవరి 12 నుంచి ZEE5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
గత ఏడాది దేశవ్యాప్తంగా భారీ వివాదాలను ఎదుర్కొని సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సినిమాల్లో 'ది కేరళ స్టోరీ' ముందు వరుసలో ఉంటుంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలను, అడ్డంకులను ఎదుర్కొని 2023 మే 5న థియేటర్స్ లో రిలీజ్ అయింది. 'హార్ట్ ఎటాక్' మూవీ ఫేమ్ ఆదాశర్మ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని సుదీప్తో సేన్ డైరెక్ట్ చేశారు. కేవలం రూ.10 కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.
దీంతో గత ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రాల్లో 'ది కేరళ స్టోరీ' చేరింది. రిలీజ్ కి ముందు సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడంతో చాలామంది ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్స్ లో మిస్సయ్యారు. రిలీజ్ తర్వాత సినిమా కలెక్షన్స్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు. దీంతో థియేటర్లో చూడలేకపోయిన ఆడియన్స్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.
రిలీజ్ కి ముందు ఎన్ని అడ్డంకులను ఎదుర్కొందో ఓటీటీ రిలీజ్ విషయంలోనూ అన్ని అడ్డంకులను ఎదుర్కొంది ఈ సినిమా. 'ది కేరళ స్టోరీ' ఓటీటీ హక్కుల విషయంలో చాలా జాప్యం జరిగింది. అసలు ఓటీటీలో రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఎట్టకేలకు 'ది కేరళ స్టోరీ' ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5 ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది.
ఈ నెలలోనే సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. జనవరి 12 నుంచి ZEE5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు కానున్నట్లు తెలుస్తోంది. ZEE5 నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేరళలో వేలాది మంది అమ్మాయిలను ప్రేమ, పెళ్లి పేరుతో కొందరు ఇస్లామిక్ దేశాలకు తీసుకువెళ్లి ఉగ్రవాదులుగా మారుస్తున్నారనే అంశంతో ఈ సినిమా రూపొందింది.
దీంతో ఈ సినిమాపై రిలీజ్ కి ముందు పలు వివాదాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ ని ఆపాలని ఏకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత ఏడాది మే 5న థియేటర్స్ లో రిలీజ్ అయి సంచలన విజయాన్ని అందుకుంది.