అమిత్, ప్రియాంకలు సక్సెస్ అవుతారా ?
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధి ఈనెలాఖరులో తెలంగాణాకు రాబోతున్నారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధి ఈనెలాఖరులో తెలంగాణాకు రాబోతున్నారు. ఇద్దరు కూడా కచ్చితమైన టార్గెట్లు పెట్టుకునే రాష్ట్రంలోకి అడుగుపెడుతున్నారు. 29వ తేదీన అమిత్ హైదరాబద్ చేరుకుని పార్టీ సీనియర్లతో సమావేశవుతారు. ఎన్నికల్లో అమలుచేయాల్సిన స్ట్రాటజీని చర్చించి, నిర్ణయించి దిశానిర్దేశం చేయబోతున్నారు. పనిలోపనిగా అదే రోజు బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకోవటమనే అజెండా కూడా ఉంది.
ఖమ్మంలో బహిరంగసభ నిర్వహణ కొంతకాలంగా వియాదాలు పడుతోంది. ఇపుడు భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఇపుడు కూడా బహిరంగసభ జరిగే అవకాశంలేదు. అందుకనే హైదరాబాద్ లోనే తెలంగాణాలోని అన్నీ జిల్లాలకు చెందిన ముఖ్యనేతలతో సుదీర్ఘమైన సమావేశంపెట్టు కున్నారు.
రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను నేతలకు అందించబోతున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తనేతలపై గాలమేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కవుటైందో అమిత్ పర్యటనలో బయటపడుతుంది.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రియాంక గాంధి 30 వ తేదీన హైదరాబాద్ చేరుకుంటారు. వెంటనే మహబూబ్ నగర్లోని కొల్హాపూర్ చేరుకుంటారు. కొల్హాపూర్ సీనియర్ నేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కొప్పుకోబోతున్నారు. ఆ సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు.
ఆ సభలోనే ప్రియాంక మహిళా డిక్లరేషన్ చేయనున్నట్లు సమాచారం. మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి హామీలను ప్రకటించబోతున్నారట. అలాగే బీఆర్ఎస్, బీజేపీల్లోని అసంతృప్త నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవటమనే టార్గెట్ కూడా ఉంది.
ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు కొందరు టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్ళల్లో ఎవరైనా ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారేమో చూడాలి. 30వ తేదీ బహిరంగసభకు పార్టీ అన్నీ ఏర్పాట్లు చేసకుంటున్నది.
అయితే రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. మరీ నేపధ్యంలో బహిరంగసభ జరుగుతుందా జరగదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ ప్రియాంక సభ వాయిదా పడితే అప్పుడేమి చేయాలనే విషయం అయోమయంలో పడిపోయింది.