కింగ్ గుండెల్లో అమల మ్రోగించిన ప్రియరాగాలు!
కింగ్ నాగార్జున-అమల దంపతుల ధాంపత్య జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు.
కింగ్ నాగార్జున-అమల దంపతుల ధాంపత్య జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించి పెళ్లిచేసు కున్న దపంతులిద్దరి మధ్య అన్యోన్యత చూడ ముచ్చటగా ఉంటుంది. ఇంట్లో ఎలా ఉంటారో? అభిమానుల మధ్యలోకి వచ్చేసరికి అంతే సరదాగా ఉంటారు. ఒకరిపై ఒకరు జోకులేసుకుని నవ్విస్తుం టారు. టాలీవుడ్ ఆదర్శదంపతులు గా అందర్నీ ఆకట్టుకుంటారు. ఇద్దరు కలిసి చేసింది కొన్ని సినిమాలే అయినా ఆల్ టైమ్ క్లాసిక్ హిట్స్ అవి.
తాజాగా అమల నాగార్జున హిట్ మూవీ `హలో బ్రదర్` లో సూపర్ హిట్ సాంగ్ ప్రియరాగాలే గుండెలోనా పొంగుతునా ఈ వేళ పాటకి అమల స్టెప్పులేసి అదరగొటేసారు. అమల 20 ఏళ్ల వయసులో డాన్సు చేసినట్టే ఉంది. వయసు పెరిగినా ఆమె డాన్సులో ఎనర్జీ..గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. అమల ప్రతి మూవ్ మెంట్ లో ఎంతో ఎనర్జీ కనిపిస్తుంది. తనదైన శైలి సిగ్నేచర్ స్టెప్పులతో అక్కినేని అభిమానులలో ఉత్సాహాన్ని నింపేసారు. ఈ వీడియో నాగార్జున చూస్తే మళ్లీ ఆయన గుండెల్లో ఆనాటి ప్రియరాగాలు మ్రోగడం ఖాయం.
అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో జరిగిన ఓ వేడుకలో.. డ్యాన్స్‌తో అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. అమల డాన్సుతో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. నేటి తరం యువత ఆ వీడియో చూసి అమల ఇంత గొప్ప డాన్సరా? అని ఆశ్చర్యపోతున్నారు.
అమల బేసిక్ గానే మంచి నాట్యకారిణి. చిన్నప్పుడే నాట్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ఓ ప్రత్యేక కళాక్షేత్రం తరుపున దేశంలో చాలా చోట్ల అమల ప్రదర్శన ఇచ్చారు. ఇతర దేశాల్లోనూ తన ప్రతిభని చాటారు అమల. శరీరాన్ని విల్లులా వంచి డాన్సు చేయడం ఆమె ప్రత్యేకత. ఆమెని సినిమాల వైపు ప్రేరేపించింది కూడా నాట్యమే. ప్రస్తుతం అమల సెలక్టివ్ గా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.