'కాంతార' క్లాసిక్ సాంగ్ `వరాహారూపం` ఊపేస్తోందిగా!
కన్నడ చిత్రం `కాంతార` పాన్ ఇండియాలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు.
కన్నడ చిత్రం `కాంతార` పాన్ ఇండియాలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా అన్ని భాషల్లోనూ అనూహ్య వసూళ్లని సాధించింది. సినిమా స్టోరీ సహా పాత్రలు ప్రతీది సినిమాని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాయి. ముఖ్యంగా ఇందులో `వరాహారూపం` పాట ఎంతో పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అన్ని భాషల్లోనూ ఆ పాటకు ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు.
సినిమాకి హైప్ తీసుకురావడంలోనూ ఆ పాట కీలక పాత్ర పోషించింది. ఆ పాటే సినిమాని వివాదంలోకి నెట్టింది. `వరాహారూపం` సాంగ్ ట్యూన్ కాపీ చేశారంటూ కొన్ని నెలల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్ట్ సినిమా నుంచి మాత్రమే కాకుండా అన్ని సోషల్ మీడియా ఫార్మాట్స్ నుంచి సాంగ్ ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో వీడియో సాంగ్ అన్ని సోషల్ మీడియా ఫార్మాట్స్ నుంచి డిలీట్ చేశారు. కేవలం లిరికల్ సాంగ్ మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ అయి ఏడాది పూర్తైన సందర్భంగా పూర్తి వీడియో సాంగ్ ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా రిలీజ్ చేశారు. ఇప్పుడా పాట వీడియోతో పాటు అందుబాటులో ఉంది. ఈ పాట యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. వీడియో పాటని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిచారు. వరహారూపం పాటని సాయి విఘ్నేష్ ఆలపించగా.. శశిరాజ్ కావూర్ సాహిత్యం అందించారు. ఈ పాట పండుగ సందర్భాల నుండి క్రికెట్ స్టేడియంల వరకు అన్నీ చోట్లా మారుమ్రోగింది. ప్రస్తుతం `కాంతార`కి పీక్వెల్ కూడా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.