సితార గొప్ప మనసు.. ఆ అమ్మాయిల కోసం ఇలా..
తన తండ్రికి చెందిన మహేష్ ఫౌండేషన్ లోని అమ్మాయిలతో కలిసి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది.
ఘట్టమనేని మహేష్ బాబు ముద్దుల తయన సితార గురించి తెలియని వారు ఎవరూ ఉండరేమో. ఇప్పటి వరకు సితార డైరెక్ట్ గా ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ, క్రేజ్ మాత్రం బాగా సంపాదించుకుంది. కాగా, ఈ ఘట్టమనేని ప్రిన్స్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. దీంతో, ఆమెకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
కాగా, తన పుట్టిన రోజు సందర్భంగా సితార మన గొప్ప మనసును తెలియజేసింది. అందరు సెలబ్రెటీల పిల్లల మాదిరిగా ఘనంగా పార్టీలు చేసుకోకుండా, సింపుల్ గా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. తన తండ్రికి చెందిన మహేష్ ఫౌండేషన్ లోని అమ్మాయిలతో కలిసి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది.
అక్కడే కేక్ కట్ చేసి, ఆ అమ్మాయిలకు ప్రేమగా తినిపించింది. వారితో సరదాగా గడిపింది. అంతేకాదు, ఆ తర్వాత ఆ ఫౌండేషన్ లోని అమ్మాయిలందరికీ సైకిల్లు బహుమతిగా పంచి పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో నమ్రత షేర్ చేసింది. దీంతో, వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందరూ, సితార గొప్ప మనసుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మొన్నటికి మొన్న ఓ జ్యూవెలరీ యాడ్ చేసింది. ఆ జ్యూడ్ లో సితారను చూసి అందరూ షాకైపోయారు. కుందనపు బొమ్మలా ఉంది. ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్ ప్రత్యేకంగా సితార కలెక్షన్ పేరుతో ఓ స్పెషల్ బ్రాండ్ ని సృష్టించడం గమనార్హం. చాలా మంది పాపులర్ హీరోయిన్లకు కూడా ఈ క్రెడిట్ దక్కలేదు.
కాగా, ఆ బ్రాండ్ జ్యువెలరీ సితార ధరించిన ఫోటోలను, దానికి సంబంధించిన యాడ్ లను న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం. ఈ జ్యూవెలరీ యాడ్ కోసం దాదాపు రూ. కోటి రెమ్యూనరేషన్ అందుకుంది. అయితే, దానిని కూడా సితార ఛారిటీ కి ఇవ్వడం విశేషం.